నక్కినపై మహిళా కమిషన్ సీరియస్

ఇప్పుడీ వ్యవహారం మహిళా కమిషన్ వరకు వెళ్లింది. త్రినాధరావు మాటలపై కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

“మన్మధుడులో అన్షును చూసి ఏందిరా ఈ అమ్మాయి లడ్డూలా ఉంది అనుకున్నాను. ఆ అమ్మాయిని చూడ్డానికే సినిమాకు వెళ్లేవాళ్లం. ఓ రేంజ్ లో ఉండేది. ఇప్పటికీ అలానే ఉంది. కొంచెం సన్నబడింది. కాస్త తినమని నేనే చెప్పాను. తెలుగుకి సరిపోదు, కొంచెం తిని పెంచాలి, అన్నీ ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పాను. కొంచెం ఇంప్రూవ్ అయింది.”

‘మజాకా’ టీజర్ రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు త్రినాధరావు నక్కిన చేసిన కామెంట్స్ ఇవి. వీటిపై అప్పుడే సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. రాత్రిపూట ఛాటింగ్ లో మాట్లాడినట్టు, పబ్లిక్ గా మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాడంటూ కామెంట్స్ పడుతున్నాయి.

ఇప్పుడీ వ్యవహారం మహిళా కమిషన్ వరకు వెళ్లింది. త్రినాధరావు మాటలపై కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మహిళా కమిషన్, త్వరలోనే అతడికి నోటీసులు జారీ చేస్తామని తెలిపింది.

ఇలా ఓపెన్ గా, బోల్డ్ గా మాట్లాడ్డం త్రినాథరావుకు కొత్త కాదు. మాట్లాడ్డంలో ఆయన కాస్త ఓపెన్ టైపు. అలా మాట్లాడి ఇదివరకే విమర్శలపాలయ్యాడు. ఇప్పుడు ఏకంగా మహిళా కమిషన్ ఆగ్రహానికి గురయ్యాడు.

12 Replies to “నక్కినపై మహిళా కమిషన్ సీరియస్”

  1. ఇలాంటి తింగరి మాటలు మాట్లాడే వెధవ లను ఒక్క సారైనా మహిళా కమిషన్ శిక్షించిందా??

    ఒక్కడికయిన తాట తీస్తే…కొంచెం వొళ్ళు దగ్గర పెట్టుకుంటారు మరి కొంత మంది

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. మైక్ లో ఆ మాట చెప్పకుండా ,

    ఊ అంటావ్ మామ వూ. ఊ అంటావవా

    కీసుక్కు ..కిశుక్కు..

    అంటూ తెర మీద వూపితే

    ఇదే మహిళా కమీషన్ వాళ్ళ ఏమైనా చేసారా ?

    అకకడ కూడా షేపులు గురించి నే కదా ..

    మైక్ లో చెప్పిన అతని మాట, వెయ్యి మంది పెద్దవాళ్ళు మాత్రమే విని వింటారు.

    సినిమా పాట అనేది ఎప్పటికీ వుండి పోతుంది.

    1. మనసులో వున్న కూడా బయటకి చెప్పకూడదు.

      కానీ సినిమా లో పాట పెట్టొచ్చు.

      ఇదే నాగరికత రూల్.

      రెండు నాలుకలు తో బతకాలి అందరూ.

Comments are closed.