తిరుమలలో మరో అపశృతి!

తాజాగా తిరుమ‌ల ల‌డ్డూ కౌంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డంతో భ‌క్తులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

తిరుమ‌ల‌లో చిన్న ప్ర‌మాదం జ‌రిగినా ఉలిక్కి ప‌డే ప‌రిస్థితి. మూడు రోజుల క్రితం తిరుప‌తిలో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఆరుగురు ప్రాణాలు కోల్పోవ‌డంతో పాటు ప‌లువురు గాయాల‌పాలు కావ‌డంతో ఆ భ‌యం భ‌క్తుల్ని వెంటాడుతోంది. తాజాగా తిరుమ‌ల ల‌డ్డూ కౌంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డంతో భ‌క్తులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

ఒక్క‌సారిగా ల‌డ్డూ కేంద్రంలోని 47వ సెంట‌ర్ నుంచి పొగ రావ‌డంతో ఏం జ‌రిగిందో అర్థం కాక ఆందోళ‌న నెల‌కుంది. ఆ కౌంట‌ర్‌లో కంప్యూట‌ర్‌కు చెందిన యూపీఎస్‌లో షార్ట్ స‌ర్క్యూట్ అయ్యింది. దీంతో మంట‌లు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది వెంట‌నే సంఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లి మంట‌ల్ని అదుపులోకి తీసుకొచ్చారు.

దీంతో భారీ ప్ర‌మాదం త‌ప్పింద‌ని భ‌క్తులు, టీటీడీ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. అస‌లే వైకుంఠ ద్వార ద‌ర్శ‌న స‌మ‌యం. ఎక్క‌డెక్క‌డి నుంచో భ‌క్తులు తిరుమ‌ల‌కు శ్రీ‌వారిని ద‌ర్శించుకోడానికి వెళ్లారు. ఈ నేప‌థ్యంలో ల‌డ్డూ కౌంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదం సంభ వించింద‌న్న స‌మాచారంతో టీటీడీ ఉన్న‌తాధికారులు వెంట‌నే అప్ర‌మ‌త్తం అయ్యారు. ఏది ఏమైనా పెద్ద ప్ర‌మాదం త‌ప్ప‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.

6 Replies to “తిరుమలలో మరో అపశృతి!”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.