కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్

మొదటి రోజే (ప్రీమియర్స్ తో కలిపి) యూఎస్ఏలో మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది.

ఇది కాస్త ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. ఎందుకంటే, ఓవర్సీస్ లో బాలయ్య భారీ వసూళ్లకు, పెద్దపెద్ద రికార్డులకు దూరం. ఎవరు ఔనన్నా-కాదన్నా ఇది వాస్తవం. అలాంటి ఓవర్సీస్ లో తన కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించారు బాలకృష్ణ. ‘డాకు మహారాజ్’తో ఇది సాధ్యమైంది.

ఈ సినిమా మొదటి రోజే (ప్రీమియర్స్ తో కలిపి) యూఎస్ఏలో మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. మొదటి రోజే మిలియన్ డాలర్ మార్క్ అనేది బాలకృష్ణకు తొలిసారి.

‘డాకు మహారాజ్’ రిలీజ్ సందర్భంగా యూఎస్ మార్కెట్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది యూనిట్. స్వయంగా బాలకృష్ణ అమెరికా వెళ్లి తన సినిమాకు ప్రచారం చేశారు. అది కలిసొచ్చింది. యూఎస్ లో చాలాచోట్ల మంచు కురుస్తున్నప్పటికీ, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేందుకు ఉత్సాహం చూపించడం విశేషం.

సినిమా కథ రొటీన్ గా ఉన్నప్పటికీ, సెకెండాఫ్ కూడా అంతా ఊహించినట్టే సాగినప్పటికీ.. స్టయిలిష్ ప్రజెంటేషన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ‘డాకు మహారాజ్’ను నిలబెట్టాయి.

రెండు డిఫరెంట్ షేడ్స్ లో బాలకృష్ణ నటించిన ఈ సినిమాకు బాబీ దర్శకుడు. ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమాకు ప్రీక్వెల్ ప్రయత్నాల్లో ఉన్నట్టు నిర్మాత నాగవంశీ తాజాగా ప్రకటించాడు.

9 Replies to “కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.