వైసీపీలో పెరుగుతున్న జోష్‌!

కూట‌మి నేత‌ల ఆలోచ‌న‌ల్లో మార్పున‌కు, చంద్ర‌బాబు స‌ర్కార్ పాల‌నే కార‌ణ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

త‌క్కువ స‌మ‌యంలోనే వైసీపీ తీవ్ర నిరాశ‌నిస్పృహ‌ల నుంచి బ‌య‌ట ప‌డుతోంది. ఇంత త్వ‌ర‌గా ఆ పార్టీ కోలుకుంటుంద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు అస‌లు ఊహించ‌లేదు. కూట‌మి ప్ర‌భుత్వం ఏడు నెల‌ల ప‌రిపాల‌న‌ను పూర్తి చేసుకుంది. అయితే నాలుగేళ్ల‌లో రావాల్సిన వ్య‌తిరేక‌త‌, ఇంత త‌క్కువ కాలంలో వ‌చ్చింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం. మ‌రీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అధికారుల చేష్ట‌ల‌తో జ‌నం త‌మ‌ను తిడుతున్నార‌ని పిఠాపురం బ‌హిరంగ స‌భ‌లో, అలాగే తిరుప‌తి తొక్కిస‌లాట ఘ‌ట‌న సంద‌ర్భంగా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ఇవ‌న్నీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వుంద‌నే సంకేతాల్ని జ‌నంలోకి బ‌లంగా తీసుకెళ్తున్నాయి. వీటికి తోడు ప‌రిపాల‌న అస‌లు క‌నిపించ‌డం లేదు. ఏదో ప్ర‌భుత్వం న‌డుస్తోందంటే, న‌డుస్తోంద‌నే రీతిలో పాల‌న సాగుతోంది. చంద్ర‌బాబు పాల‌న ఇంత అధ్వానంగా వుంటుంద‌ని తాము సైతం క‌ల‌లో కూడా ఊహించ‌లేద‌ని టీడీపీ నేత‌లు కూడా అంటున్నారు.

చంద్ర‌బాబు స‌ర్కార్‌పై వ్య‌తిరేక‌త రావ‌డానికి, ఇదే సంద‌ర్భంలో వైసీపీలో జోష్ పెర‌గ‌డానికి కార‌ణాలు లేక‌పోలేదు. విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద‌లు ముంచెత్త‌డం, తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌ని చంద్ర‌బాబు ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని స‌ర్వోన్న‌త న్యాయ స్థానం కామెంట్స్‌తో జ‌నానికి తెలియ‌డం, తాజా తిరుప‌తిలో తొక్కిస‌లాట దుర్ఘ‌ట‌న‌, ఉచిత ఇసుక ఉత్తుత్తిదే కావ‌డం, అలాగే కీల‌క హామీలేవీ అమ‌లుకు నోచుకోక‌పోవ‌డం త‌దిత‌ర కార‌ణాలు ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌కు దారి తీశాయి.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ అలివికాని హామీలు ఇచ్చారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌, సామాజిక పింఛ‌న్ల పెంపు మిన‌హాయిస్తే, ఆర్థిక ప్ర‌యోజ‌నాలు క‌లిగించే ఏ ఒక్క హామీ అమ‌లుకు నోచుకోలేద‌న్న కోపం ప్ర‌జానీకంలో వుంది. ఇదేమ‌ని ప్ర‌శ్నిస్తే …గ‌త ప్ర‌భుత్వం ఖ‌జానాను ఖాళీ చేసింద‌న్న ప్ర‌భుత్వ వాద‌న జ‌నానికి న‌చ్చ‌డం లేదు. అన్నీ తెలిసే క‌దా హామీలు ఇచ్చార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇవ‌న్నీ వైసీపీకి రాజ‌కీయంగా క‌లిసొస్తున్నాయి. కేవ‌లం ఆరు నెల‌ల పాల‌న‌లోనే ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై వైసీపీ పోరుబాట ప‌ట్ట‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఈ ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌న్నీ విజ‌య‌వంతం కావ‌డంతో వైసీపీలో జోష్ పెరిగింది. మ‌రీ ముఖ్యంగా వైఎస్ జ‌గ‌న్ ఎక్క‌డికెళ్లినా జ‌నం పోటెత్తుతుండ‌డంతో అధికారంపై ఆ పార్టీలో భ‌రోసా వ‌చ్చింది. మ‌ళ్లీ జ‌గ‌న్ అధికారంలోకి రార‌ని పారిశ్రామిక‌వేత్త‌లు త‌మ‌ను రాసివ్వాల‌ని అడుగుతున్నార‌ని లోకేశ్ కామెంట్స్ టీడీపీకి న‌ష్టం క‌లిగిస్తుండ‌గా, వైసీపీలో ధీమాను పెంచుతున్నాయి.

ఏది ఏమైనా కూట‌మి స‌ర్కార్ పెట్టే క‌ష్టాలు తాత్కాలిక‌మే అని, మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత వాళ్ల క‌థ చూస్తామ‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. కూట‌మి నేత‌లు కూడా అధికారంలోకి వ‌చ్చిన తొలిరోజుల్లో ఏవేవో ఊహించుకుని ప్ర‌త్య‌ర్థుల‌పై తెగ‌బ‌డేవాళ్లు. కానీ ఇప్పుడు వాళ్ల‌కు కూడా త‌త్వం బోధ‌ప‌డిన‌ట్టుంది. ప్ర‌భుత్వంలో ఏవైనా ప‌నులు చేసుకోవ‌డ‌మా? లేక మౌనంగా వుండ‌డ‌మా? ఇదే మంచిద‌ని ఆలోచిస్తున్నారు.

కూట‌మి నేత‌ల ఆలోచ‌న‌ల్లో మార్పున‌కు, చంద్ర‌బాబు స‌ర్కార్ పాల‌నే కార‌ణ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అందుకే కాలం ఎప్పుడూ ఒకేలా వుండ‌ద‌ని చెప్ప‌డం. ముఖ్యంగా వైఎస్ జ‌గ‌న్‌లో అధికారంపై న‌మ్మ‌కం క‌ల‌గ‌డంతో ఇక వెనుతిరిగే చూసే ప్ర‌శ్నే ఉండ‌దు. జ‌నంలోకి వెళ్ల‌డానికి ఆయ‌న ఉత్సాహం చూపుతున్నారు.

64 Replies to “వైసీపీలో పెరుగుతున్న జోష్‌!”

        1. Pottu pettunkunte thappa manaki scean Ledhu ani ,one side love kakunda money ichhi 2 side love cheyandi ani cbn ki salaha ichharu chudandi alanti valani adagali ani

          1. పొత్తు ఎలా పెట్టుకున్నా.. ప్రజలు సమ్మతించారు కదా హరి గారు..

            ఇక మీ సింగల్ సింహాన్ని తరిమేయడానికి “సిద్ధం” అయిపోయాక .. జనాలకు మీ పార్టీ చెప్పేదేముందడు..

            పండగ పూటైనా హ్యాపీ గా ఉండండి..

  1. కరెక్ట్.. ఇక మావోడు 2039 వరుకు కళ్ళు మూసుకుని, తడిగుడ్డ ఏసుకుని పడుకోవచ్చు.. అధికారం అదే తన్నుకుంటూ వస్తుంది.

    ‘ఒరేయ్ నీలి సన్నాసులు, ఎవర్రా అక్కడ.. నా ఋషికోండ ప్యాలెస్ లో “బాత్ టబ్ and toilet” ని అంతవరకు ఎవరూ వాడకుండా చుడండ్రా.. సంజే..!

  2. ఏదో ప్రమాదం జరిగి నలుగురు చనిపోతే.. దాన్ని అడ్డం పెట్టుకుని “శవాల పార్టీ పిర్రల బర్రెలు” ICU లో “సెలైన్ స్టాండ్స్ విసిరేసి “జబ్బర్దస్త్” చేస్తే జోష్ వచ్చినట్టా?? గ్యాస్ ఆంధ్రా??

  3. జగ్గు గాడి botton పరిపాలన అంత నచ్చిందా… 5 years lo oka, రోడ్డు గుంతలు పూడ్చలేని వాడు cm ga అవసరమా… Jaggu emi emi చేతకాదు అని వైసిపి వాళ్ళకి తెలుసు…. ఒక pressmeet face చేయలేని వాడు, oka project gurinchi అవగాహన లేని వాడు… 24 గంటలు pellalu పిల్లలు ani ఎదుటి వాళ్ళ personal vishayalu matladevadu politician kadu…. అసలు వాడు oka manishe కాదు…..

  4. ఆరు నెలల్లో వ్యతిరేకత రాదు గ్యాస్ రెడ్డి. సందింటి రెడ్డి ఈ ఆరునెలల్లో పొడిచేశాడా అంటే అలా ఏం లేదు బెంగుళూరు అప్ అండ్ డౌన్ చేయడం తప్ప. టైం పడుతుంది వాస్తవంలోకి రండి

  5. ఇసక అప్పుడు…6000…ఇప్పుడు…3500

    Cement…450 now 350…

    మొత్తం ecosystem full busy WITH WORKS…మాకు పథకాలు వద్దు…ఇలా batakaniste మేమే tax కడతాం…greenco tcs పోలవరం full speed…ఇది కదా govt అంటే…

  6. Ha! Ha!! LoL!!

    ఉన్న నాయకులె Y.-.C.-.P పార్టి వదిలి పెట్తి పొతుంటె, ఎదొ జొష్ అంట!! అది లెకె ఈ GA జాకీలు!!

  7. బాబు surity బాదుడు గ్యారంటీ

    సర్వ శాఖల collection మంత్రి చిట్టీ నాయుడు

    red book రాజ్యాంగం లొ చేస్తుంది కక్ష సాధిపు మాత్రమే. state GST in negative and declined. దోచుకో పంచుకో తినుకో

  8. Correct … endukante dabbu panchatledu..kevalam old people ki .. diseased persons ki pension pencharu. Salaries time ki.istunnaru…roads patches vesaru..industries testunnaru..weavers ki free power…amravati….polavaram kadutunnaru….Kab attitude wasteeeee…kevalam neekistamyna party adikaramlo lekapothe Vedava stories rasi paruvu teesukoku..Modi 2 lakhs projects foundation…start chesaru…

    Inkaaa 4.6 years echeyalaaevu.. reevaluate konchem..

  9. ఇలాంటి లంజే కబుర్లు చెప్పే, మావోడిని why not 175?? అనేలా చేయించి, చివరికి 11 గుడిపించాడు ఈ గ్యాస్ ఎంకటి గాడు..

  10. jagan reddy palana ela undedi ante ippudu just roads ki patches vesina chalu 2029 lo 120 seats guarantee anetlu undi. Antha la low expectations lo janalu unnaru. Thanks to jagan Mohana

  11. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  12. No one will remember any of this in 4 years. Even when stampedes happened in CBN sir’s ongole and guntur shows you people said Kootami is gone. But look what kootami accomplished. So, litte teesuko GA. Kootami will win again.

  13. అప్పట్లో వైఎ*స్ఆర్ ప్రమాదం లో చని*పోకమిందే,

    తనని సిఎం చేయమని ఎంఎ*ల్ఏ సపో*ర్ లెట*ర్ లు రెడీ గా చేసి పెట్టుకున్నాడు. మరి , అతనికి ముందుగా*నే ఎ*లా తెలి*సిందో మరి.

    అందరి వెళ్లి ఇడుపులపాయలో వెతుకుతూ వుంటే, కొడుకు గారు మాత్రం తనకే సి*ఎం పదవి ఇవ్వాలి అను హో*టల్ లో మీటింగ్ లో బిజీ గా ఉన్నారు.

    మ*నిషి అనేవాడు అసలు ఇలా చేస్తాడా ?

    వైఎస్ఆ*ర్ ఫ్యా*న్ అనే యే గొ*ట్టం గాడు ఈ ప్రశ్న అడ*గదు.

  14. అసలు తిరుపతి లడ్దు లొ కల్తీ జరగలెదు అని సర్వొత్తర న్యాయస్తనం ఎక్కడ చెప్పిందిరా! చూపించు!! నీకు నువ్వు, నీ ఇష్తం వచ్చినట్టు రాసుకుంటె అది నిజం అయిపొతుందా?

  15. కొన్ని రొజులుగా జొష్ కొసం GA పిచ్చ పిచ్చ గా రాస్తూ… పడుతున్న పడరాని పాట్లు చూసి జనం నవ్వూకుంటున్నరు!

    .

    అదిగొ మన జగన్ నిదర లెగుస్తున్నడు! లెగిస్త మనిషి కాదు!

    పాలెస్స్ వదిలి వస్తున్నాడు! వచ్చాడు అంటె ఇక అంతె!

    పవన్ కి నిలకడలెదు. అదిగొ జనసెన TDP మద్య గొడవలు!

    అదిగొ ప్రజలు మరన్ని ఉచ్చితాలు కొరుకుంటున్నరు

    అల్లదిగొ ప్రజలలొ ఉచ్చితాలు కొసం వ్యతిరెకత

    పెట్టుబడులకి జగన్ ని చూసి పెట్టుబడిదార్లు భయపటుతున్నారు,

    అంటె జగనె మళ్ళి వస్తాడు అని తెలిపొయింది.

    అదికొ కూటమి విడిపొబొతున్నరు.

    ఇంకె ముంది RK కూడా అదె చెపుతున్నాడు!

    ఇoకె ముంది వచ్చె ఎన్నికాలొ జగనె గెలిచెది.

    అదిగొ చంద్రబాబు పని అయిపొయింది

    ఇదిగొ Y.-.C.-.P లొ జొష్ నిండింది!

Comments are closed.