పవన్ పాట లీక్.. రేపే రిలీజ్?

‘హరిహర వీరమల్లు’ నుంచి పవన్ కల్యాణ్ పాడిన సాంగ్ లీక్ అయింది.

లెక్కప్రకారం ఈపాటికి ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి సాంగ్ బయటకు రావాలి. 6వ తేదీన రావాల్సిన ఈ పాట ఇంతవరకు రాలేదు. ఈరోజు లేదా రేపు ఈ సాంగ్ పై ప్రకటన వస్తుందని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రకటన రాలేదు కానీ సాంగ్ లీక్ అయింది.

అవును.. ‘హరిహర వీరమల్లు’ నుంచి పవన్ కల్యాణ్ పాడిన సాంగ్ లీక్ అయింది. చేతిలో కంజర పట్టుకొని స్వయంగా పవన్ కల్యాణ్ ఆలపించిన పాట అది. “మాట వినాలి గురుడా మాట వినాలి.. మాట వినాలి మంచి మాట వినాలి..” అనే లిరిక్స్ తో జానపద శైలిలో పాడే ఈ పాట ఆన్ లైన్ లో ప్రత్యక్షమైంది.

దీంతో ఈ సాంగ్ ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రేపు ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ అవుతుంది. 17 లేదా 18న లిరికల్ వీడియోను విడుదల చేస్తారు.

జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ‘హరిహర వీరమల్లు’. సినిమాకు సంబంధించి ఓ బ్లాక్ షూటింగ్ పెండింగ్ లో ఉంది. అది పూర్తయితే షూట్ మొత్తం పూర్తయినట్టే. మార్చి 28న హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ Vs స్పిరిట్ సినిమా రిలీజ్ అవుతుంది.

One Reply to “పవన్ పాట లీక్.. రేపే రిలీజ్?”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.