టీడీపీ సీనియర్ నేత, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు రాజకీయంగా మరుగున పడుతున్నారనే మాట వినిపిస్తోంది. అచ్చెన్నకు మంత్రి పదవి ఇవ్వడం వరకూ ఓకే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అచ్చెన్నాయుడు తన నియోజకవర్గ పార్టీ శ్రేణులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్లలు వేసుకుని ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే… టీ, కాఫీ ఇచ్చి గౌరవించి, పని చేసి పెట్టాలని అధికారుల్ని ఆదేశించారు.
ఆ తర్వాత ఎందుకనో ఆయన పెద్దగా వార్తల్లో వుండడం లేదు. మంత్రి పదవి ఇచ్చామంటే, ఇచ్చామన్నట్టుగా అచ్చెన్న పరిస్థితి తయారైందనే చర్చ టీడీపీలో అంతర్గతంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా సీనియర్ నేతల్ని నెమ్మదిగా పక్కన పెట్టి, యువ నాయకుల్ని ప్రోత్సహించాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం వుంది. ఇందులో భాగంగా లోకేశ్ టీమ్ తయారవుతోంది. అచ్చెన్నకు లోకేశ్ అంటే పెద్దగా మంచి అభిప్రాయం లేదని టీడీపీలో ఎవర్ని అడిగినా చెప్తారు.
ఈ విషయం లోకేశ్‌కు కూడా బాగా తెలుసు. అయితే వైసీపీ హయాంలో అచ్చెన్న జైలుకు వెళ్లారనే ఏకైక కారణంతో ఆయనపై చంద్రబాబుకు సానుభూతి వుంది. మంత్రి పదవి వరకూ సరిపెట్టి, రాజకీయంగా ఇక మీ సేవలు అనవసరం అని అచ్చెన్నాయుడికి పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. కూటమి ప్రభుత్వం రైతులకు భరోసా సొమ్ము ఇవ్వలేదని, దీంతో వాళ్ల ఇళ్లల్లో సంతోషం లేదని వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది.
వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత అచ్చెన్నాయుడిపై వుంది. కానీ ఆయనకు బదులు మరో మంత్రి పార్థసారథి ఘాటైన విమర్శలు చేయడం గమనార్హం. తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అచ్చెన్నాయుడు కూడా మనకెందుకులేబ్బా అనే నిరుత్సాహంలో ఉన్నారని సమాచారం. రాజకీయాల్లో తరం మారుతున్నప్పుడు ఏ పార్టీలో అయినా ఇలాంటి పరిణామాలు సర్వసాధారణమే.
ఆయనకి స్టేట్ క్యాబినెట్ మినిస్ట్రీ, రామ్మోహన్ కి సెంట్రల్ క్యాబినెట్ మినిస్ట్రీ, వాళ్ల కుటుంబంలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. నాకు తెలిసీ మీరు రాజేస్తున్న కుంపటి తప్ప దక్కిన పదవులు, ప్రాధాన్యతకు వాళ్లు సంతృప్తి గానే ఉండొచ్చు.
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
ఈసారి కూడా మా A1అదిదంపతులు తాడేపల్లి
“ప్యాలెస్ లో తిరుమల సెట్టింగ్” వేసుంటే ఆ జోష్ వేరే లెవెల్ ఉండేది
..ఉప్చ్ మిస్ అయ్యాం.. చాలా భాదగా ఉంది రా గ్యాస్ ఎంకి..
A1దంపతులు
“పందికొవ్వు కలిపిన ప్రసాదం తింటూ ఎంజాయ్ చేసిన క్షణాలు” నభూతో నా భవిష్యత్
మొన్నటి వరకూ అచ్చెం నాయిడు ఫామిలీకి 4 సీట్లు ఇస్తారా అని ఎడిచావ్! మళ్ళి ఇప్పుడు దొశ తెరగెసావ్!
అచ్చెం నాయిడు కి ఇంపార్టెన్సె ఉందా, లెదా? ఎదొ ఒక దాని మీద నిలబడరా?
అంటే మన జగ్గడి జమానా లో రవాణా , విద్య, ఆర్ధిక, వ్యవసాయ, ఆబ్కారీ ఏ సమస్య అయినా శాఖల శాఖ మంత్రి జవాబు చెప్పాడు..అంటే మొత్తం మంత్రి వర్గం అంతా మరుగునపడినట్లేనా
Veedu elevate ayithe cbn ki ucha mari.
250 crore ESI scam lo addanga dorikaadu with proofs tho…
sign chesindi veede cheyipichindi cbn gaaru maree..papam book ayyadu…daaniki thodu peanut antha brain ..
He has come into line light only due to his brother otherwise he is not a strategist or good orator or good face value in public