పండుగ అంటే మద్యం జూదం కాదు

శాసనసభ స్పీకర్‌గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగు వారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ప్రపంచం మొత్తం మీద ఎక్కడ తెలుగు వారు ఉన్నా తమ సొంత గూటికి చేరుతారు. బంధువులతో అందరితో కలసి పండుగ చేసుకుంటారు. పూర్వ కాలం నుంచి వస్తున్న సంప్రదాయాలను ఇంకా అలా కొనసాగిస్తున్నారు.

దీని కోసం దూరాలను, ఆర్థిక భారాలను ఏ మాత్రం లెక్క చేయడం లేదు. ఖర్చును, ప్రయాసను అసలు చూసుకోవడం లేదు. అయితే రాను రానూ పండుగలు అంటే సంస్కృతి సంప్రదాయాలు కంటే ఇతర విషయాలు ప్రధానం అవుతున్నాయి.

పందేలు, జూదాలు, మందు, వినోదాలకు పెద్ద పీట వేస్తున్నారు. ఈ విషయంపై శాసనసభ స్పీకర్‌గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన భోగి పండుగను తన నివాసంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తిని కలిగించే వ్యాఖ్యలు చేశారు.

పండుగలు అంటే మద్యం, జూదం కాదని ఈనాటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని సూచించారు. కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా పండుగలను జరుపుకోవాలని పిలుపు ఇచ్చారు. తెలుగు సంప్రదాయాలను, తెలుగు రీతులను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం మరింతగా జరగాలని ఆకాంక్షించారు.

పెద్దాయనగా, తలపండిన నేతగా అయ్యన్న చెప్పినది కరెక్ట్ అని అంటున్నారు. గతంలో మాదిరిగా పల్లెలలో కూడా పండుగ ఉత్సాహం అంటే సంస్కృతి సంప్రదాయాల కంటే ఇతర అంశాల మీదనే దృష్టి కనిపిస్తోందని విమర్శలు ఉన్నాయి. పండుగలు అంటే సరదాగా గడిపామా లేదా అని చూస్తున్నారు అన్నదే ఉంది. అలా కాకుండా ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంది. దానిని చాటి చెప్పే ప్రయత్నం చేయాలని పెద్దలు అందరూ సూచిస్తున్నారు. అయ్యన్న కూడా ఇదే చెబుతున్నారు. దీనిని ఇకనైనా అందరూ పాటించాలని కోరుతున్నారు.

8 Replies to “పండుగ అంటే మద్యం జూదం కాదు”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. ఆ ముక్క వయసులో ఉన్నప్పుడు సెప్పాలి .. వృద్దనారిలు ఎన్ని సెబితే మాత్రం ఏం లాభాం…

  3. ఏదీ last year మా A1 అదిదంపతులు

    “తాడేపల్లి ప్యాలెస్ లో “తిరుమల సెట్టింగ్” వేసి చక్కగా “పందికొవ్వుకలిపిన ప్రసాదం” తింటూ సంక్రాంతి విశిష్టత గురించి రాష్ట్ర ప్రజలకి demonstrate చేసినట్టా??

  4. నిజమె! మన గుట్కా గెలిస్తె వాటితొ పాటు క్యాసినొ, అమ్మయిల డ్యన్సులు కూడా పెట్తించె వాడు అంటావా?

Comments are closed.