ర‌ఘురామ స‌హ‌నానికి కూట‌మి స‌ర్కార్ ప‌రీక్ష‌!

ముంబ‌యి న‌టి కాదంబ‌రి జెత్వానీ కేసుకు ఇచ్చిన ప్రాధాన్యం, త‌న కేసులో ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న బ‌హిరంగంగానే ప్ర‌శ్నిస్తున్నారు.

డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు స‌హ‌నానికి కూట‌మి స‌ర్కార్ ప‌రీక్ష పెడుతోంది. వైసీపీ హ‌యాంలో సీఐడీ క‌స్ట‌డీలో చిత‌క్కొట్టార‌ని, దానికి సంబంధించిన కేసు విచార‌ణ‌లో కూట‌మి స‌ర్కార్ అవ‌లంబిస్తున్న తీరుపై డిప్యూటీ స్పీక‌ర్ ఏ మాత్రం సంతృప్తిక‌రంగా లేరు. ముంబ‌యి న‌టి కాదంబ‌రి జెత్వానీ కేసుకు ఇచ్చిన ప్రాధాన్యం, త‌న కేసులో ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న బ‌హిరంగంగానే ప్ర‌శ్నిస్తున్నారు.

ర‌ఘురామ‌లో అసంతృప్తి నెమ్మ‌దిగా పెరుగుతోంది. మొగ్గ‌ద‌శ‌లోనే ఆయ‌న‌లోని ఆగ్ర‌హాన్ని కూట‌మి స‌ర్కార్ చ‌ల్లార్చ‌క‌పోతే మాత్రం.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా గ‌ళం విప్ప‌డానికి ఏ మాత్రం వెనుకాడర‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కాదంబ‌రి జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల‌పై కేసు పెట్ట‌డంతో పాటు స‌స్పెండ్ కూడా చేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే వాళ్లంతా హైకోర్టులో ముంద‌స్తు బెయిల్ పొందారు.

ఇదే రీతిలో త‌న‌పై దాడికి పాల్ప‌డిన నాటి మాజీ సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌పై ఎందుకు కేసు పెట్ట‌లేదు? అలాగే ఆయ‌న్ను స‌స్పెండ్ చేయ‌క‌పోవడానికి కార‌ణం ఏంటి? అని ఆయ‌న నిల‌దీస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా సునీల్‌కుమార్ ముఖ్య అనుచ‌రుడు తుల‌సిబాబుకు త‌న పార్టీకి చెందిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అండ‌గా నిల‌బ‌డ‌డంపై ర‌ఘురామ తీవ్ర ఆగ్ర‌హావేశాల‌తో ర‌గిలిపోతున్నారు.

అయితే కూట‌మి స‌ర్కార్ ప్ర‌స్తుతం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌తో పోల్చుకుంటే, ర‌ఘురామ స‌మ‌స్య అస‌లు కంటికి క‌నిపించ‌నంత సూక్ష్మ‌మైన‌దని పాల‌కుల భావ‌న‌. ఇప్ప‌టికే ర‌ఘురామ‌ను కొట్టిన కేసులో కొంద‌రిని అరెస్ట్ చేశామ‌ని ప్ర‌భుత్వం చెపుతోంది. ర‌ఘురామ కోరుకున్న‌ట్టు చేయాలంటే కుద‌ర్ద‌ని, సునీల్‌కుమార్ విష‌యంలో ఏం చేయాలో త‌మ‌కు బాగా తెలుస‌ని కూట‌మి స‌ర్కార్ పెద్ద‌లు ఆఫ్ ది రికార్డుగా అంటున్నారు.

ప్ర‌భుత్వ పెద్ద‌ల వాద‌న‌ను ర‌ఘురామ అంగీక‌రించే ప‌రిస్థితిలో లేరు. త‌న పంతాన్ని నెగ్గించుకోవ‌డం ఒక్క‌టే ఆయ‌న‌కు ముఖ్యం. ముఖ్యంగా ముంబ‌య్ న‌టి కాదంబ‌రి కేసును త‌న కేసుతో పోల్చి వాదిస్తుండ‌డంతో ప్ర‌భుత్వం కూడా ఇర‌కాటంలో ప‌డే ప‌రిస్థితి. రానున్న రోజుల్లో ర‌ఘురామ‌ కోరుకున్న‌ట్టు కేసులో పురోగ‌తి క‌నిపిస్తే స‌రేస‌రి. లేదంటే ప్ర‌భుత్వంపై ఫైర్ కావ‌డానికి కూడా ఆయ‌న రెడీగా ఉన్నారు.

11 Replies to “ర‌ఘురామ స‌హ‌నానికి కూట‌మి స‌ర్కార్ ప‌రీక్ష‌!”

  1. ఈసారి అవన్నీ miss.. Uptch

    last year మా A1 అదిదంపతులు “తాడేపల్లి ప్యాలెస్ లో “తిరుమల సెట్టింగ్” వేసి చక్కగా “పందికొవ్వుకలిపిన ప్రసాదం” తింటూ సంక్రాంతి విశిష్టత గురించి రాష్ట్ర ప్రజలకి demonstrate చేసారు..

    ఈసారి అవన్నీ miss అవుతున్నాం..

  2. నువ్వు చెపుతునట్టు కక్ష సాదింపులె ముక్యం అనుకుంటె.. తెలికగా ఎంతొ మందిని బొక్కలొ వెసెవారు!

    RRR విషయం లొ ఆర్మి కొర్ట్ దెబ్బల విషయం అప్పుడె నిర్దారించింది. ఈ విషయం లొ ఎవరినీ ఉపెక్షించాల్సిన అవసరం లెదు!

  3. అంటే నీ ఉద్దేశం ja*** గాడ్ని బొక్కలో వేసి బోగి పండగ చేయమంటావ్ ఏంట్రా Venki !!

  4. అంటే నీ ఉద్దేశం ja*** గాడ్ని బొ*క్కలో వేసి బోగి పండగ చేయమంటావ్ ఏంట్రా Venki !!

  5. ర‌ఘురామ‌లో అసంతృప్తి నెమ్మ‌దిగా పెరుగుతోంది. మొగ్గ‌ద‌శ‌లోనే ఆయ‌న‌లోని ఆగ్ర‌హాన్ని కూట‌మి స‌ర్కార్ చ‌ల్లార్చ‌క‌పోతే మాత్రం.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా గ‌ళం విప్ప‌డానికి ఏ మాత్రం వెనుకాడర‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు

    ఒక దగ్గర పిత్తిన గు ద్ద మరోక చోట రామ కీర్తన పాడుద్దా ?

  6. దాదాపు హార్డుకోరే టీడీపీ అభిమానులు అందరు రాజు గారికి న్యాయం జరగాలనే కోరుకొంటున్నారు ఆయనకన్నా టీడీపీ కి వెల్ విషర్ లు ఎవరు వుంటారు దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత టీడీపీ మీద వుంది తులసిబాబును సీరియస్ గ విచారించి నిజాలు కక్కించాలి

Comments are closed.