బాబులో కే’డ‌ర్‌’

వైసీపీ శ్రేణుల్ని యాక్టీవ్ చేయ‌డం జ‌గ‌న్ వ‌ల్ల కావ‌డం లేదు. ఆ ప‌ని చంద్ర‌బాబు చేస్తున్నార‌నే అభిప్రాయం క‌లుగుతోంది.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆలోచ‌న‌ల్లో చాలా వ్య‌త్యాసం. అందుకే టీడీపీ, వైసీపీ వ్య‌వ‌స్థాగ‌త నిర్మాణాల్లో కూడా ఎంతో తేడా వుంటుంది. టీడీపీలో కార్య‌క‌ర్త‌ల‌కు ఎంతో విలువ వుంటుంది. వైసీపీలో లేనిది అదే. మ‌రీ ముఖ్యంగా వైసీపీ అధికారంలో వున్న ఐదేళ్లు కేడ‌ర్‌ను ప‌ట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. వాలంటరీ వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చి, త‌న నెత్తిన భ‌స్మాసుర హ‌స్తాన్ని జ‌గ‌న్ పెట్టుకున్నారు.

జ‌గ‌న్‌కు ప‌ట్టిన దుస్థితిని చూసి, వాలంటీర్ల‌కు రూ.10 వేలు ఇస్తాన‌న్న చంద్ర‌బాబు హామీతో పాటు ఆ వ్య‌వ‌స్థ‌ను వ‌ద్ద‌నుకున్నారు. అయితే కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత టీడీపీ కేడ‌ర్‌లో త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌న్న అసంతృప్తి వుంది. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు ప‌సిగ‌ట్టారు. అందుకే ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా గంగాధ‌ర‌నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో సీఎంగా చంద్ర‌బాబు నోట నుంచి రాకూడ‌ని మాట‌లొచ్చాయి.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల్ని రాజ‌కీయంగా విడ‌గొట్టి మాట్లాడ‌రంటే అర్థం చేసుకోవ‌చ్చు. కానీ ఎప్పుడూ అదే ఆలోచ‌న‌తో చూడ‌డం సంకుచిత స్వ‌భావాన్ని ప్ర‌తిబింబిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయిన‌ప్ప‌టికీ పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశం కావ‌డం, అందులోనూ వాళ్ల‌లో అసంతృప్తి వుంద‌ని గ్ర‌హించి, టీడీపీ జాతీయ అధ్య‌క్షుడిగానే చంద్ర‌బాబు మాట్లాడ్డం గ‌మ‌నార్హం. ఇంత‌కూ ఆయ‌న ఏమ‌న్నారంటే…

“వైసీపీ నాయ‌కుల‌కు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ప‌నులు చేయ‌వ‌ద్దు. వారికి ప‌నులు చేస్తే పాముల‌కు పాలు పోసిన‌ట్టే. వాళ్ల‌కు ప‌నులు చేసినట్టు తెలిస్తే స‌హించేది లేదు. పార్టీ విజ‌యం కోసం ర‌క్తం చిందించిన కేడ‌ర్ గురించి ఈ తొమ్మిది నెల‌ల్లో ఆలోచించ‌లేక‌పోయాం. రాబోయే రోజుల్లో ప్ర‌తి కార్య‌క‌ర్త‌కూ అందుబాటులో వుంటాను. పొలిటిక‌ల్ గ‌వ‌ర్నెన్స్‌ను నిజ‌మైన స్ఫూర్తితో అమ‌లు చేస్తా”

గ‌తంలో జ‌న్మ‌భూమి క‌మిటీల‌ను పెట్టి, ఇలాగే ప్ర‌జ‌ల్ని వేధించారు. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు త‌మ‌కు ఇష్ట‌మైన వాళ్లను సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారులుగా ఎంపిక చేసి, చివ‌రికి 2014 ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇప్పుడు పొలిటిక‌ల్ గ‌వ‌ర్నెన్స్ పేరుతో చంద్ర‌బాబే ప్ర‌జ‌ల్ని పార్టీల వారీగా విభ‌జించ‌డం విశేషం. టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తిని చ‌ల్లార్చేందుకు చంద్ర‌బాబు ఈ మాట‌లు మాట్లాడుతున్నార‌నేది అంద‌రికీ తెలిసిన స‌త్య‌మే. అయితే ఇదే సంద‌ర్భంలో ఆ పేరుతో వైసీపీ వాళ్ల‌లో క‌సి పెంచుతున్నాన‌నే వాస్త‌వాన్ని ఆయ‌న గ్ర‌హించ‌లేక‌పోతున్నారు.

వైసీపీ శ్రేణుల్ని యాక్టీవ్ చేయ‌డం జ‌గ‌న్ వ‌ల్ల కావ‌డం లేదు. ఆ ప‌ని చంద్ర‌బాబు చేస్తున్నార‌నే అభిప్రాయం క‌లుగుతోంది. చంద్ర‌బాబు తాజా భ‌రోసాతో టీడీపీ కేడ‌ర్ రెచ్చిపోవ‌డం ఖాయం. ఆ దుష్ప‌రిణామాలు ప్ర‌భుత్వానికి ఏ పేరు తీసుకొస్తాయో రానున్న రోజుల్లో కాల‌మే జ‌వాబు చెప్ప‌నుంది. అయితే చంద్ర‌బాబు కామెంట్స్ ప్ర‌స్తుతానికి కేడ‌ర్‌లో ఉత్సాహం నింపేలా ఉన్నాయ‌న్న‌ది నిజం.

12 Replies to “బాబులో కే’డ‌ర్‌’”

  1. ప్రజలు వేరు గతం లో వైసీపీ హయం లో వనరులను దోచుకొన్న నాయకులూ వేరు అయన నాయకులను ఉద్దేశించి అన్నదాన్ని వక్రీకరించటం మీకే చెల్లు

      1. నిద్రపోయినోడిని లేపొచ్చు నటించేవాడిని లేపలేము సర్ ఎవరు దుర్మార్గులో చదువుకున్న ప్రతీవాడికి తెలుసు అందుకే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లలో వేరే వాళ్లకు మద్దతు ఇస్తా తోక లాగా మిగిలేరు

      2. నిద్రపోయినోడిని లేపొచ్చు నటించేవాడిని లేపలేము సర్ ఎవరు దుర్మార్గులో చదువుకున్న ప్రతీవాడికి తెలుసు అందుకే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లలో వేరే వాళ్లకు మద్దతు ఇస్తా తోక లాగా మిగిలేరు

Comments are closed.