వైసీపీకి బ‌ల‌మైన వాయిస్

వైసీపీకి బ‌ల‌మైన వాయిస్‌గా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని వేంప‌ల్లెకు చెందిన ఎస్వీ స‌తీష్‌రెడ్డి ఆ పార్టీ శ్రేణుల అభిమానాన్ని చూర‌గొంటున్నారు.

వైసీపీకి బ‌ల‌మైన వాయిస్‌గా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని వేంప‌ల్లెకు చెందిన ఎస్వీ స‌తీష్‌రెడ్డి ఆ పార్టీ శ్రేణుల అభిమానాన్ని చూర‌గొంటున్నారు. ఒక‌ప్పుడు వైఎస్సార్‌, ఆ త‌ర్వాత ఆయ‌న కుమారుడైన వైఎస్ జ‌గ‌న్‌పై పులివెందులలో టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన నాయ‌కుడు స‌తీష్‌రెడ్డి. ప్ర‌త్య‌ర్థుల‌కు భ‌య‌ప‌డే ర‌కం కాదు. ఏదైనా విష‌యాన్ని సూటిగా, ధాటిగా చెప్ప‌గ‌ల నేర్ప‌రిత‌నం స‌తీష్‌రెడ్డి సొంతం.

2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎమ్మెల్సీ ప‌ద‌విని చంద్ర‌బాబు ఇచ్చారు. ఆ త‌ర్వాత మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ చేశారు. 2019లో జ‌గ‌న్‌పై స‌తీష్‌రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అనంత‌రం లోకేశ్‌తో విభేదాలు రావ‌డంతో టీడీపీకి దూరంగా ఉన్నారు. 2024 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. వైసీపీ ఓడిపోయిన త‌ర్వాత ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన నాయ‌కుల‌కు ప్రాధాన్యం ఎవ‌రికైనా ఇస్తున్నారంటే, ఆ ఒక్క‌డు స‌తీష్‌రెడ్డి మాత్ర‌మే.

స‌తీష్‌రెడ్డికి ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్ మంచి ప్రాధాన్యం ఇస్తున్నారు. జ‌గ‌న్ న‌మ్మ‌కానికి మించి స‌తీష్‌రెడ్డి వైసీపీ కోసం ప‌ని చేస్తున్నార‌న్న భావ‌న ఆ పార్టీ నేత‌ల్లో వుంది. రెండురోజుల‌కో సారి మీడియా స‌మావేశం నిర్వ‌హిస్తూ కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం ప్ర‌కారం పాల‌న సాగిస్తుంటే, వైసీపీ నేత‌లెవ‌రూ తిర‌గ‌లేర‌ని హోంమంత్రి వంగ‌ల‌పూడి అనిత తీవ్ర హెచ్చ‌రిక చేయ‌గా, ఏపీ మీ జాగీరు కాదంటూ స‌తీష్‌రెడ్డి దీటుగా కౌంట‌ర్ ఇచ్చారు.

కూట‌మి స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డానికి కొంద‌రు వైసీపీ నాయ‌కులు భ‌య‌ప‌డుతున్న సంద‌ర్భంగా, ఆ పార్టీ త‌ర‌పున బ‌ల‌మైన గొంతుక‌గా ఆయ‌న మార‌డం ఆ పార్టీకి కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. అటు వైపు ఎవ‌ర‌ని కాదు, విధానాలప‌రంగా తిప్పి కొట్ట‌డంలో స‌తీష్‌రెడ్డి మాట్లాడుతున్న తీరు అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. ఇలాంటి నాయ‌కుడిని జ‌గ‌న్ ఎంత వ‌ర‌కు కాపాడుకుంటారో చూడాలి.

8 Replies to “వైసీపీకి బ‌ల‌మైన వాయిస్”

  1. అసెంబ్లీ అంటేనే లంగాలోనే ఉచ్చా పోసుకుని భయపడుతున్నాడు, ఇలాగే ఇంకో 6 నెలలు ్యాలెస్లో దాక్కుంటే, RRR disqualify చేయ్యడం గ్యారెంటీ.. అందుకే బై ఎలక్షన్స్ లో సతీష్రెడ్డిని పులివెందుల నుండి నిలబడమని బంగపోతున్నాడు .. ల0గా గాడు

  2. ముందు నీ విజయసాయి రెడ్డి లొ ఎమి అసంత్రుప్తి ఉందొ చూసుకొరా అయ్యా!

  3. ఈ సతిష్ రెడ్డి TDP లొ ఉన్ననాల్లు ఎప్ప్పుడూ ఈయన గురించి ఒక మంచి మాట GA రాయలెదు! ఇప్పుడు మాత్రం ఈయన వీరుడు సూరుడు అని రాస్తున్నాడు!

    .

    ఎంత మంది ముఠా నాయకులని పెట్టుకున్నా, నియంత్రుత్వం ఉన్నా పులివెందెలలొ జగన్ కి వచ్చిన మెజారిటీ 60 వేలు. లొకెష్ కి వచ్చిన మజారిటీ 90 వేలు! పవన్ కి వచ్చిన మజారిటీ 70 వేలు!!

  4. మొన్న MLC ఈ రోజు ఈ రెడ్డి , నువ్వు ని హైప్ . బిల్డప్ బాబాయ్ 11 రెడ్డి ని మించి పోయావు

Comments are closed.