తమ్ముళ్లకే దిక్కులేదు.. వైసీపీ వాళ్లను ఉద్ధరిస్తారా?

టీడీపీ వాళ్ల ప‌నుల‌కే దిక్కులేదు. వైసీపీ వాళ్ల‌ను ఉద్ధ‌రిస్తున్నార‌ని చంద్ర‌బాబు అన‌డం విచిత్రంగా వుంద‌ని టీడీపీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

సీఎం చంద్ర‌బాబునాయుడు నోరు తెరిస్తే చాలు… వైసీపీ వాళ్ల‌కు ప‌నులు చేయొద్ద‌ని అంటున్నారు. వాళ్ల‌కు ప‌నులు చేయ‌డ‌మంటే పాముకు పాలుపోసి పెంచ‌డ‌మే అని త‌న వాళ్ల‌ను చంద్ర‌బాబు హెచ్చ‌రిస్తున్నారు. సీఎంగా ఇలా మాట్లాడ్డం త‌ప్ప‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. అయినా చంద్ర‌బాబు ఖాత‌రు చేయ‌లేదు. ఎవ‌రేం అనుకున్నా ఫ‌ర్వాలేదు, టీడీపీ శ్రేణుల‌కు న‌చ్చితే చాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్న‌ట్టుగా అర్థ‌మ‌వుతోంది.

కానీ ఆయ‌న అర్థం చేసుకోవాల్సిన ప్ర‌ధాన విష‌యం ఒక‌టి వుంది. త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డిందే గానీ, ఒక్క ప‌ని కూడా కాలేద‌న్న అసంతృప్తి ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో తీవ్రంగా వుంది. జ‌న‌సేన వాళ్ల‌లో ఇదే అభిప్రాయం లేక‌పోలేదు. టీడీపీ శ్రేణుల అసంతృప్తిని పోగొట్టేందుకు సీఎం చంద్ర‌బాబు వాళ్ల‌కు ఏం ప‌నులు చేస్తారో చెప్పాలి. టీడీపీ వాళ్ల ప‌నుల‌కే దిక్కులేదు. వైసీపీ వాళ్ల‌ను ఉద్ధ‌రిస్తున్నార‌ని చంద్ర‌బాబు అన‌డం విచిత్రంగా వుంద‌ని టీడీపీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధులు దోచుకోడానికే స‌రిపోతుంద‌ని, ఆదాయం వ‌చ్చే చిన్న ప‌నుల్ని కూడా త‌మ‌కు వ‌దిలిపెట్ట‌డం లేద‌ని టీడీపీ గ్రామ‌, మండ‌ల స్థాయి నాయ‌కులు వాపోతున్నారు. వాస్త‌వ ప‌రిస్థితులు ఇలా వుంటే, వైసీపీ వాళ్ల‌కు ప‌నులు చేయొద్ద‌ని చంద్ర‌బాబు చెప్ప‌డం విడ్డూరంగా వుంద‌ని టీడీపీ దిగువ శ్రేణి నాయ‌కులు వాపోతున్నారు. తొమ్మిది నెల‌ల్లో టీడీపీ కేడ‌ర్‌ను ప‌ట్టించుకోలేద‌ని, ఇక‌పై వాళ్ల‌కే ప్రాధాన్యం ఇస్తాన‌ని ఇటీవ‌ల చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు అన్న మాట‌ల్ని వాళ్లు గుర్తు చేస్తున్నారు.

స్వ‌యంగా తానే పార్టీ శ్రేణుల్ని ప‌ట్టించుకోలేద‌ని అన్న త‌ర్వాత‌, ఇక శ‌త్రువుగా చూసే వైసీపీ నాయ‌కుల ప‌నులు ఎవ‌రు చేస్తార‌ని, బాబు మాట‌లు మాన‌సికంగా సంతృప్తిప‌ర‌చ‌డానికే త‌ప్ప‌, రూపాయి ప్ర‌యోజ‌నం క‌లిగించేవి కావ‌ని అంటున్నారు.

5 Replies to “తమ్ముళ్లకే దిక్కులేదు.. వైసీపీ వాళ్లను ఉద్ధరిస్తారా?”

  1. ఆ మాటలు అన్నది సాదరణ ప్రజలని ఉద్దెసించి కాదు!

    ఆయన చెప్పింది Y.-.C.-.P నాయకులతొ లాలూచిపడి వారి అవినీతి ని కొనసాగనివ్వకండి అని. అలాంటి ఎ పనులు మీరు చేసిపెట్టవద్దు అని! అందులొ తప్పెముంది!

  2. ఏదో పెద్దాయన కదా softcorner ఉంటుంది.. మా 11మోహన లా కక్ష సాధించే గుణం కాదు.. టీడీపీ ఉన్నా మనమే ఏలోచ్చు అనుకుంటే చంద్రబాబు ఏందీ ఇలా మారిపోయాడు .. ఇలా అయితే మనం ఎలా బతికేది అంటున్న గ్యాస్ ఆంధ్రా వెంకటి ‘చెడ్డీ..!

Comments are closed.