ప‌వన్‌ను బ‌ర్త‌రఫ్ చేయాలి

అట‌వీశాఖ అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డం కాద‌ని, ప‌వ‌న్‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

వైఎస్సార్ జిల్లా కాశిరెడ్డినాయ‌న ఆశ్ర‌మంలో భ‌వ‌నాలు ప‌డ‌గొట్ట‌డంపై హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయి. కాశిరెడ్డినాయ‌న ఆశ్ర‌మానికి ఎంతో విశిష్ట‌త వుంది. తిరుమ‌లలో సైతం నిర్ణీత స‌మ‌యంలోనే అన్న‌ప్ర‌సాదం చేస్తారు. కానీ కాశినాయ‌న ఆశ్ర‌మంలో అలా కాదు. 24 గంట‌లూ అన్న‌దానం చేస్తుంటారు. ఇదే ఆశ్ర‌మం ప్ర‌త్యేక‌త‌. ఈ ఆశ్ర‌మం బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గంలో వుంటుంది. కాశిరెడ్డినాయ‌న పేరుతో ప్ర‌త్యేకంగా ఒక మండ‌లాన్ని కూడా ఏర్పాటు చేశారు.

అట‌వీ భూములు, టైగ‌ర్ జోన్ నిబంధ‌న‌ల కార‌ణంగా న‌ల్ల‌మ‌ల‌లోని కాశినాయ‌న ఆశ్ర‌మం అన్న‌దాన స‌త్రాన్ని అట‌వీశాఖ అధికారులు కూల్చార‌ని , అయితే బాధాక‌ర‌మ‌ని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ కూల్చివేత‌ల‌కు ప్ర‌భుత్వం త‌ర‌పున తాను క్ష‌మాప‌ణ చెబుతున్న‌ట్టు మంత్రి తెలిపారు. కానీ ఇంత వ‌ర‌కూ అట‌వీశాఖ మంత్రి, స‌నాత‌న ధ‌ర్మం గురించి నీతులు చెబుతున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పందించ‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.

ఈ విష‌య‌మై ఆళ్ల‌గ‌డ్డ వైసీపీ నాయ‌కుడు భూమా కిషోర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. అట‌వీశాఖ అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డం కాద‌ని, ప‌వ‌న్‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. లేదంటే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

స‌నాత‌న ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షించ‌డానికి ప్ర‌త్యేకంగా యాక్ట్ తీసుకురావాల‌ని తిరుప‌తి వేదిక‌గా నీతులు చెప్పిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త‌న‌కు సంబంధించిన అట‌వీశాఖ అధికారులు ఎంతో విశిష్ట‌త క‌లిగిన కాశిరెడ్డినాయ‌న ఆశ్ర‌మ అన్న‌దాన భ‌వ‌నాల‌ను కూల్చ‌డం తెలియ‌దా? అని నిల‌దీశారు. భ‌క్తుల న‌మ్మ‌కాలు, విశ్వాసాలతో ముడిప‌డిన సున్నిత అంశాల్ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అస‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం హిందువుల ఆగ్ర‌హానికి గురి చేస్తోంది. కాశినాయ‌న ఆశ్ర‌మ భ‌వ‌నాల‌ను అట‌వీశాఖ కూల్చివేయ‌గా, ఆ శాఖ‌తో సంబంధం లేని మంత్రి లోకేశ్ క్ష‌మాప‌ణ చెప్ప‌గా, బాధ్య‌త వ‌హించాల్సిన ప‌వ‌న్ మాత్రం మౌనాన్ని ఆశ్ర‌యించ‌డం తీవ్ర వ్య‌తిరేక‌త‌కు దారి తీస్తోంది.

19 Replies to “ప‌వన్‌ను బ‌ర్త‌రఫ్ చేయాలి”

  1. 😂😂😂….ఈ యెడుపు సరిపోదు GA….pawan kalyan మీద ఇలా బురద చల్లడం వల్ల మీకు నష్టం తప్ప లాభం లేదు GA…..

  2. వర్మ కి మొన్న సపోర్ట్ చేస్తూ మాట్లాడితే వాడి ఖర్మ పవన్ కి ఏమి సంబంధం అన్నారు. అదే పవన్ మీద నెగెటివ్ ఆర్టికల్ వచ్చేసరికి జనసేనా కన్నా ముందు టీడీపీ వాళ్ళు ఈగ వాలనివ్వరు. మనకేంటి సంబంధం అని అనుకోవచుగా.

  3. కాబినెట్ లో ఒక మంత్రి స్పందిస్తే ప్రభుత్వం స్పందించినట్లు కాదా? మళ్ళీ సీఎం , డిప్యూటీ సీఎం లు ప్రత్యేకముగా స్పందించాలా?

    1. ఆర్థిక శాఖ పళ్లపై ఎవరో ఒక మంత్రి సంతకం పెడితే సరిపోతుందా ఆర్థిక శాఖ మంత్రి సంతకం పెట్టాలా

      1. మరి అన్నీ శాఖల గురించి ప్రభుత్వంలో లేనే సజ్జల ఎలా స్పంచివారో ? అందుకే అన్నాను “కుక్కలకి లెక్కలు అర్ధం కావు” అని. ప్రభుత్వం ఎలా నడుస్తుందో తెలియదు , అందుకే 11 కి పడి పోయారు. నీకో తెలియని విషయం ఏమంటే , అసెంబ్లీలో కూడా ఒక మంత్రి శాఖకి సంబంధించి ప్రశ్నవస్తే ఆ మంత్రి దగ్గర సరియైన సమాధానం లేకపోతే , వేరే సహచర మంత్రి సమాధానం చెప్పవచ్చు. రోశయ్య , చంద్రబాబు, యనమల ఇలా చాలా మంది వేరే మంత్రుల ను అసెంబ్లీలో కవర్ చేశారు.

      2. మరి అన్నీ శాఖల గురించి అసలు ప్రభుత్వంలో కూడా లేని సజ్జల ఎలా స్పందించేవారో ? అందుకే అన్నాను “కుక్కలకి లెక్కలు అర్ధం కావు” అని. ప్రభుత్వం ఎలా నడుస్తుందో తెలియదు , అందుకే 11 కి పడి పోయారు. నీకో తెలియని విషయం ఏమంటే , అసెంబ్లీలో కూడా ఒక మంత్రి శాఖకి సంబంధించి ప్రశ్నవస్తే ఆ మంత్రి దగ్గర సరియైన సమాధానం లేకపోతే , వేరే సహచర మంత్రి సమాధానం చెప్పవచ్చు. రోశయ్య , చంద్రబాబు, యనమల ఇలా చాలా మంది వేరే మంత్రుల ను అసెంబ్లీలో కవర్ చేశారు.

  4. అసలు అటవీ భూముల్లో ఎందుకు భవనాలు అనుమతి లేకుండా కట్టారు. కొట్టివేస్తే ఎందుకు గగ్గోలు పెడుతున్నారు లోకేష్ గారు రాజకీయ అవసరాల కోసం క్ష మాపణ చెప్పి ఉద్యోగం చేసిన అధికారులను అవమానపరిచారు.

Comments are closed.