సమంతాను అంతా మరిచిపోతున్నారా?

టాలీవుడ్ లో ఆమె గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రమాదాన్ని ఇప్పటికే పసిగట్టింది సమంత.

క్రేజ్ అనేది లైఫ్ లాంగ్ ఉండదు. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఈ పాపులారిటీ నీటి బుడగ లాంటిది. దాన్ని ఎన్ని ఎక్కువ రోజులు కాపాడుకోగలిగితే అంత మంచిది. లేదంటే, ప్రేక్షకులు ఇట్టే మరిచిపోతారు. ప్రస్తుతం సమంత పరిస్థితి కూడా ఇదే.

తెలుగు ప్రేక్షకులు ఆమెను మెల్లమెల్లగా మరిచిపోతున్నారనేది వాస్తవం. ఎందుకంటే, ఆమె తెలుగులో సినిమాలు చేయట్లేదు, అలాంటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఇక్కడ ఆడియన్స్ ను నిందించాల్సిన అవసరం లేదు, తప్పు సమంతలోనే ఉంది.

మొన్నటివరకు ఆమె ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడింది కాబట్టి ఎవరూ ఏం అనలేదు. కనీసం కోలుకున్న తర్వాతైనా సినిమాలు చేయాలి కదా. మూవీస్ పక్కనపెట్టి వరుసగా వెబ్ సిరీస్ చేసుకుంటూ వస్తోంది. ముంబయికే పరిమితమైంది.

అలాంటప్పుడు టాలీవుడ్ లో ఆమె గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రమాదాన్ని ఇప్పటికే పసిగట్టింది సమంత. రీసెంట్ గా ఆమెపై వరుసగా స్టోరీలు వస్తున్నాయి. “ఇదిగో సినిమా.. అదిగో కొత్త ప్రాజెక్టు” అంటూ ఫీలర్లు వస్తున్నాయి.

ఇదంతా సమంతాను లైమ్ లైట్లో ఉంచేందుకు ఆమె పీఆర్ పడుతున్న కష్టం తప్ప ఇంకోటి కాదు. ఆల్రెడీ ప్రకటించిన సినిమానే సమంత ఇప్పటివరకు సెట్స్ పైకి తీసుకురాలేదు. ఇప్పుడేమో మరిన్ని కొత్త సినిమాలంటూ లీకులు. ఈ సెల్ఫ్ ప్రమోషన్ కూడా ఎక్కువ కాలం నడవదేమో.

5 Replies to “సమంతాను అంతా మరిచిపోతున్నారా?”

  1. చేతులారా తన జీవితం నాశనం చేసుకుంది

    Legendary family, మంచి భర్త హ్యాపీ లైఫ్ కాదు అనుకుని web series మోజులో పడి ఎక్సపోసింగ్

    వల్గర్ యాక్టింగ్ లు, ఐటమ్ సాంగ్స్ అంటా తన గొయ్యి తనే తీసుకుంది. West యాక్టర్…….

Comments are closed.