బాడీ షేమింగ్.. ఇప్పుడు దీని గురించి ఓపెన్ గా చాలామంది మాట్లాడుతున్నారు కానీ దశాబ్దాలుగా ఇది పరిశ్రమలో పాతుకుపోయింది. బాలీవుడ్ లో మేటి నటిగా గుర్తింపు తెచ్చుకున్న రేఖ లాంటి తారలు కూడా బాడీ షేమింగ్ బారిన పడ్డారు. నల్లగా ఉందని రేఖతో కలిసి నటించడానికి ఓ నటుడు అంగీకరించలేదు.
1969.. రేఖ అప్పుడే బాలీవుడ్ లో అడుగుపెట్టారు. మొదటి సినిమా ఇబ్బందుల్లో పడింది. అంతలోనే సావన్ భదో అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అందులో నవీన్ నిశ్చోల్ సరసన నటించే అవకాశం అందుకుంది. కొత్తవాడు అయినప్పటికీ రేఖ సరసన నటించడానికి నవీన్ నిరాకరించాడట. ఆమె కాస్త లావుగా, నల్లగా ఉందని.. అలాంటి అమ్మాయితో కలిసి నటించనని అన్నాడట.
ఇలా కెరీర్ తొలినాళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు రేఖ. ఏకంగా రాజ్ కపూర్ లాంటి దిగ్గజ నటుడే రేఖపై పరోక్షంగా బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారట.
రేఖను బాలీవుడ్ కు పరిచయం చేసిన వ్యక్తి కుల్జిత్ పాల్. ఓ సినిమాలో కొత్తమ్మాయి కోసం ఆయన వెదుకుతున్నారు. చెన్నైలోని జెమినీ స్టుడియోలో రేఖను చూశారు. అక్కడే ఆడిషన్ నిర్వహించి, వెంటనే తన సినిమాలోకి తీసుకున్నారు.
అలా రేఖను బాలీవుడ్ కు పరిచయం చేసిన కుల్జీత్ పాల్ పై, రాజ్ కపూర్ సెటైర్ వేశారు. “నువ్వు ఆఫ్రికా నుండి వచ్చిన పారిశ్రామికవేత్త అయి ఉండాలి, అందుకే నీకు అలాంటి హీరోయిన్ నచ్చింది” అంటూ కామెంట్ చేశారంట.
ఒక దశలో స్టార్ హీరో శశి కపూర్ కూడా రేఖను బహిరంగంగా అవమానించారు. “ఈ అమ్మాయి హీరోయిన్ ఎలా అవుతుందో నాకు అర్థం కావడం లేదు.” అంటూ ఓపెన్ గానే స్టేట్ మెంట్ ఇచ్చారట.
ఇలా ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ, రేఖ వెనక్కు తగ్గలేదు. అన్నింటినీ ఆమె భరించింది, తననుతాను మలుచుకుంది. బాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా ఎదిగింది. అలా అందరి నోళ్లు మూయించింది.
ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ఒక వేళ నిజమే అయ్యుంటే, సదరు రాజ్ కపూర్ ఏమైనా నవ మన్మధుడా, అతి సుందరుడా ?