పవన్ కల్యాణ్ సినిమా వాయిదా

హరిహర వీరమల్లు సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజైంది. అయితే అంతా ఊహించినట్టుగానే సినిమా వాయిదా పడింది.

పండగ వచ్చిందంటే తమ స్టార్ హీరో సినిమా నుంచి ఏదో ఒక అప్ డేట్ వస్తుందని ఊహిస్తారు ఫ్యాన్స్. పవన్ ఫ్యాన్స్ కూడా దీనికి అతీతం కాదు. లెక్కప్రకారం ఈ నెలలోనే హరిహర వీరమల్లు థియేటర్లలోకి రావాలి.

ఓవైపు సినిమా వాయిదా అంటూ లీకులు, మరోవైపు అభిమానుల్లో మాత్రం ఏదో మూల ఆశ. ఇలాంటి టైమ్ లో హోలీ పండగ వచ్చింది. కచ్చితంగా ఈ పండక్కి సినిమా నుంచి అప్ డేట్ వస్తుందని, మరీ ముఖ్యంగా విడుదల తేదీపై క్లారిటీ వస్తుందని అంతా ఊహించారు.

ఇప్పుడదే జరిగింది. హరిహర వీరమల్లు సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజైంది. అయితే అంతా ఊహించినట్టుగానే సినిమా వాయిదా పడింది. మే 9కి సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఓవైపు కొత్త పోస్టర్ ను ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు సినిమా వాయిదా పడిందని బాధపడుతున్నారు పవన్ ఫ్యాన్స్.

హరిహర వీరమల్లు కచ్చితంగా వాయిదా పడుతుందని యూనిట్ తో పాటు అంతా ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే, కీలకమైన ఓ బ్లాక్ షూటింగ్ ను పవన్ కల్యాణ్ ఇంకా పూర్తి చేయలేదు. అదెప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల మధ్య సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది.

మూవీ పోస్ట్ పోన్ అవ్వడంతో, ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్ని తాత్కాలికంగా ఆపేశారు. ఇప్పటికే 2 పాటలు రిలీజ్ అవ్వగా, మిగతా సాంగ్స్ ను ప్రస్తుతానికి విడుదల చేయడం లేదు.

One Reply to “పవన్ కల్యాణ్ సినిమా వాయిదా”

Comments are closed.