టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌కు మంత్రి కొడాలి నాని అంటే సింహస్వప్నమే. బహుశా కొడాలి నాని రాజకీయంగా దాడిచేసినట్టు మరే నేత తండ్రీకొడుకులను విమర్శించి ఉండరేమో.
తాజాగా మరోసారి బాబు, లోకేశ్‌లపై కొడాలి నాని విరుచుకుపడ్డారు. గుడివాడలో బుధవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ మరోసారి విరుచుకుపడ్డారు.
అధికారం కోసం ఎంతకైనా దిగజారే చంద్రబాబు నాయుడు అసలు మనిషే కాదన్నారు. 74ఏళ్ల వయసు, ఇంత రాజకీయ అనుభవం ఉన్న ఆయన కులాలు, మతాల గురించి మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శమన్నారు.
సీఎం, మంత్రి, డీజీపీ, ఎస్‌పీలు క్రిస్టియన్‌లు అంటూ మాట్లాడటం ఘోరమన్నారు. చంద్రబాబు లాంటి నీచుల కోసమే అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధ్యతలు తీసుకునేటప్పుడు కుల మత రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తామని ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నారు.
నీచ రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబును ప్రజలు భూస్థాపితం చేయాలని నాని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మిడత లాంటి లోకేష్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. లోకేశ్‌కు తాజాగా కొడాలి సరికొత్త పేరు పెట్టారు.