సీరియస్ గా చూస్తున్న షెకావత్ సార్!

పుష్ప-2 యూనిట్ మరోసారి సందడి చేసింది. అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఇప్పటికే సంచలనం సృష్టించిన యూనిట్, ఇప్పుడు మరో కీలక పాత్రధారి ఫహాద్ ఫాజిల్ అప్ డేట్ తో అందరి…

పుష్ప-2 యూనిట్ మరోసారి సందడి చేసింది. అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఇప్పటికే సంచలనం సృష్టించిన యూనిట్, ఇప్పుడు మరో కీలక పాత్రధారి ఫహాద్ ఫాజిల్ అప్ డేట్ తో అందరి ముందుకొచ్చింది.

ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అతడి పాత్ర పేరు భన్వర్ సింగ్ షెకావత్. సినిమాలో అందరూ షెకావత్ సార్ అని పిలుస్తుంటారు.

సినిమాలో ఈ క్యారెక్టర్ చాలా కీలకం. మరీ ముఖ్యంగా పుష్ప పార్ట్-1లో షెకావత్ క్యారెక్టర్ హిట్టవ్వడంతో, పార్ట్-2 కోసం ఈ పాత్ర నిడివిని మరింత పెంచారంట. ఇప్పుడీ క్యారెక్టర్ కు సంబంధించి కీలకమైన ఎనౌన్స్ మెంట్ చేసింది యూనిట్. ఫాజిల్ తో ఓ భారీ షెడ్యూల్ పూర్తయింది.

భన్వర్ సింగ్ షెకావత్ తో కీలకమైన షెడ్యూల్ పూర్తయిందని, ఈసారి షెకావత్ పాత్ర పగతో రగిలిపోతుందంటూ హింట్ కూడా ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఓ వర్కింగ్ స్టిల్ ను కూడా రిలీజ్ చేశారు.

దేశవ్యాప్తంగా పుష్ప అనేది ఓ బ్రాండ్ గా మారింది. ఈ సినిమాలో పాటలు, డైలాగ్స్ విపరీతంగా పాపులర్ అయ్యాయి. దీంతో రెండో భాగం పుష్ప2-ది రూల్ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కిస్తున్నామని ప్రకటించింది యూనిట్.

మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.