కమెడియన్ కమ్ హీరో సప్తగిరి కథానాయకుడిగా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 4గా రూపొందనున్న చిత్రం 'ఎయిట్'. సూర్యాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.
దీంతో సప్తగిరి నేరుగా ఆ లాంగ్వజ్ ల్లోకి కి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న స్టోరీ కావడం వల్లే నాలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. ఇల్యూజన్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రాన్ని రిజ్వాన్ నిర్మిస్తుండగా, ఖుషి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా టైటిల్ లోగో పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 'ఎయిట్' అనే టైటిల్ ఎంత ఆసక్తి కలిగిస్తున్నదో, టైటిల్ డిజైన్ అంతగా ఆకట్టుకునలా వుంది. సప్తగిరికి ఉన్న ఇమేజ్‌కు తగినట్లు చిత్రంలో వినోదానికి పెద్దపీట వేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.జనవరిలో షూటింగ్ ప్రారంభించనున్నట్లు పోస్టర్లో వెల్లడించారు.
ఎన్.ఎస్. ప్రసు సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి నజీర్ సినిమాటోగ్రాఫర్‌గా, వంశీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.