శాకుంతలం…ఓవర్ సీస్..అసలేం జరిగింది?

శాకుంతలం సినిమా ఓవర్ సీస్ బయ్యర్ వెనకడుగు వేసారని నిన్న వార్త అందించాం. అలాంటింది లేదంటూ బయ్యర్ ట్వీట్ వేసారు. అసలు ఈ వార్త కు..ఆ ట్వీట్ కు మధ్య ఏం జరిగింది. అసలు…

శాకుంతలం సినిమా ఓవర్ సీస్ బయ్యర్ వెనకడుగు వేసారని నిన్న వార్త అందించాం. అలాంటింది లేదంటూ బయ్యర్ ట్వీట్ వేసారు. అసలు ఈ వార్త కు..ఆ ట్వీట్ కు మధ్య ఏం జరిగింది. అసలు ఓవర్ సీస్ వ్యవహారం ఏం నడుస్తోంది? చూద్దాం.

శాకుంతలం ఓవర్ సీస్ రైట్స్ మొత్తం తాను తీసుకుంటా అని రాధాకృష్ణ సంస్థ అధినేత వెంకట్ ముందుకు వచ్చారు. నాలుగుకోట్ల అయిదు లక్షలకు బేరం సెట్ అయింది. కొంత మొత్తం అడ్వాన్స్ ఇచ్చారు. కానీ రిటెన్ అగ్రిమెంట్ చేయలేదు. అది తెలిసి మరో ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్ అయిన. ఫారస్ ఫిలింస్ రంగంలోకి దిగింది. ఎలాగూ అగ్రిమెంట్ లేదు కదా తమకు ఇచ్చేయమని కోరింది. అది సరి కాదు అని, అడ్వాన్స్ తీసుకుంటే కమిట్ అయినట్లే అని నిర్మాత దిల్ రాజు ఫారస్ ప్రతినిధికి చెప్పేసారు.

దాంతో అదర్ దాన్ యుఎస్ తమకు ఇవ్వమని ఫారస్ సంస్థ కోరింది. దానికి రాధాకృష్ణ సంస్థ వెంకట్ రెండు కోట్లు కోట్ చేసారు. ఫారస్ సంస్థ 1.50 కోట్లు కోట్ చేసింది. ఇక్కడ బేరం తెగకపోవడంతో, దిల్ రాజు రంగంలోకి దిగారు. 1.50 కోట్లకు ఇచ్చేయమని కోరారు. దానికి రాధాకృష్ణ మూవీస్ వెంకట్ ఓకె అన్నారు. ఇవన్నీ నోటి మాటలే.

ఇప్పుడు విడుదల దగ్గరవుతుంటే దిల్ రాజు ఫోన్ చేసి ఫారస్ కు అదర్ దాన్ యుఎస్ వద్దు అంట..బయటకు ఇచ్చేసుకోమని రాధాకృష్ణ మూవీస్ వెంకట్ కు చెప్పేసారు. ఈ లాస్ట్ మినిట్ లో తాను ఎలా మార్కెట్ చేస్తానని, తనకూ కిట్టుబాటు కాదని, వద్దని వెంకట్ చెప్పేసారు. చేస్తే యుఎస్ ఒక్కటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు.

దాంతో మల్లగుల్లాలు మొదలయ్యాయి. ఎవరైనా బయ్యర్ నాన్ యుఎస్ కు వస్తారేమో అని వెదుకులాట ప్రారంభించారు. ఇదీ జరిగింది. ఈ వార్తలు బయటకు రావడంతో దిల్ రాజు ఆందోళన వ్యక్తం చేసారు. సినిమా విడుదల ముందు ఇలాంటి వార్తలు బయటకు వస్తే సినిమాకు డ్యామేజ్ అని ఆయన అన్నారు.

ఏ సినిమా అయినా, ఏ బయ్యర్ అయినా ఓసారి సినిమాకు కమిట్ అయితే డబ్బులు కట్టాలి తప్ప ఇలా ముందు వెనుక కాకూడదని అన్నారు. హారిక సంస్థ నిర్మించిన ఓ భారీ సినిమా డిజాస్టర్ అవుతుతుందని తనకు ముందే తెలుసు అని, అయినా వెనకడుగు వేయకుండా అంతా కట్టానని గుర్తు చేసుకున్నారు. ఓవర్ సీస్ సంస్థ ఫారస్ ప్రతినిధి కూడా అదే అన్నారు. తనకు ఎన్నో భారీ సినిమాలో ఎంతో డబ్బు పోయిందని, అయినా కమిట్ అయిన ప్రకారం డబ్బులు కట్టామని అన్నారు.

దిల్ రాజు, రాధాకృష్ణ మూవీస్ వెంకట్, ఫారస్ ప్రతినిధి ముగ్గురూ గ్రేట్ ఆంధ్రతో మాట్లాడిన దాని ప్రకారం ఓవర్ సీస్ హక్కుల వ్యవహారంలో మల్లగుల్లాలు నడుస్తున్నాయన్నది వాస్తవం. అయితే డబ్బులు తగ్గించి అదే బయ్యర్ కు ఇస్తారా? అదే బయ్యర్ తీసుకుంటారా? అన్నది తేలాల్సి వుంది.

ఇప్పుడు రాధాకృష్ణ మూవీస్ ట్వీట్ వేస్తారో..సమాధానం చెబుతారో కొన్ని ప్రశ్నలు వున్నాయి.

దిల్ రాజు కు సంబంధం లేకుండా రాధాకృష్ణ మూవీస్ గుణశేఖర్ తో నేరుగా డీల్ చేసింది వాస్తవమా కాదా?

ఫారస్ ఫిలింస్ కు 1.50 కోట్లు ప్లస్ దిల్ రాజు పాతిక లక్షల వంతున వేసుకుని, అదర్ దాన్ ఓవర్ సీస్ ఇవ్వాలని అనుకున్నది వాస్తవమా కాదా?

ఇప్పుడు ఫారస్ ఫిలింస్ అదర్ దాన్ ఓవర్ సీస్ తమకు వద్దని వెనక్కు తగ్గిన మాట వాస్తవం కదా?

ఇప్పుడు ఓవర్ సీస్ రైట్స్ మీద నిర్మాతలు, ఓవర్ సీస్ బయ్యర్లు మల్లగుల్లాలు పడుతున్న మాట వాస్తవమా కాదా.