నువ్వేంటో తెలిసిన వాళ్లకు… ఈ మాటలతో పనిలేదు!

ఇండియ‌న్ క్రికెట్ స్టార్ విరాట్‌కోహ్లీ త‌న 33వ పుట్టిన రోజును ఇవాళ జ‌రుపుకుంటున్నాడు. ఈ సంద‌ర్భంగా అత‌నికి ప్ర‌పంచ వ్యాప్తంగా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆయ‌న భార్య అనుష్క‌శ‌ర్మ శుభాకాంక్ష‌లు ఎంతో ప్ర‌త్యేకం.  Advertisement…

ఇండియ‌న్ క్రికెట్ స్టార్ విరాట్‌కోహ్లీ త‌న 33వ పుట్టిన రోజును ఇవాళ జ‌రుపుకుంటున్నాడు. ఈ సంద‌ర్భంగా అత‌నికి ప్ర‌పంచ వ్యాప్తంగా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆయ‌న భార్య అనుష్క‌శ‌ర్మ శుభాకాంక్ష‌లు ఎంతో ప్ర‌త్యేకం. 

ఇన్‌స్టా వేదిక‌గా త‌న‌దైన ప్రేమ నిండిన మ‌న‌సుతో, ఎమోష‌నల్ క‌ల‌గ‌లిపి సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించిన శుభాకాంక్ష‌లు నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ సంద‌ర్భంగా అద్భుత‌మైన ఫొటో ఆమె షేర్ చేయ‌డం విశేషం.  

‘అచ్చం నువ్వు ఎలాగైతే జీవితంలో ముందుకు సాగుతావో.. అలాగే ఈ ఫొటోకు కూడా ఎలాంటి మెరుగులు అక్కర్లేదు. ఉక్కు సంకల్పం, నిజాయితీతో కూడినది నీ వ్యక్తిత్వం. చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా లెక్క చేయక ముందుకు వెళ్లే ధైర్యం నీ సొంతం. నీలా చీకటి నుంచి అత్యున్నత శిఖరాలకు చేరగల వ్యక్తి మరొకరు ఉండరని నాకు తెలుసు. నీ మనసులో భయానికి తావులేదు. రోజురోజుకీ నువ్వు ఎదుగుతున్న విధానం అమోఘం’ అంటూ క‌వితాత్మ‌కంగా అనుష్క రాసుకెళ్లింది. ఇంకా ఆమె ఏమ‌న్నారంటే…

‘మనిద్దరం ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా మాట్లాడుకునేంత తీరిక లేదని నాకు తెలుసు. అయితే, కొన్నిసార్లు నాకు బిగ్గరగా అరిచి చెప్పాలనిపిస్తుంది… నీ అంతటి అత్యద్భుత వ్యక్తి మరొకరు లేరని ఈ ప్రపంచానికి చాటిచెప్పాలని ఉంటుంది. నువ్వంటే ఏమిటో తెలిసిన వాళ్లకు ఈ మాటలతో పనిలేదు. జీవితంలో ప్రతి విషయాన్ని ప్రకాశవంతంగా,. మరింత అందంగా తీర్చిదిద్దుతున్నందుకు థాంక్యూ. హ్యాపీ బర్త్‌డే క్యూట్‌నెస్‌’ అని త‌న మ‌న‌సులోని భావాల‌ను అనుష్క పంచుకున్నారు.

అనుష్క-విరాట్‌లు సుదీర్ఘ కాలంపాటు ప్రేమలో మునిగితేలారు. 2017లో పెళ్లి చేసుకున్నారు. ఈ ప్రేమ జంట‌కు ఈ ఏడాది జనవరి 11న కూతురు వామికా జన్మించిన సంగ‌తి తెలిసిందే. ప్రేమకు ప‌ర్యాయ‌ప‌దంగా ఈ జంట అన్యోన్యంగా జీవితాన్ని ఆస్వాదిస్తోంది.  

భ‌ర్త‌పై త‌న ప్రేమ‌ను ప్ర‌పంచానికి చాటి చెప్పే క్ర‌మంలో తాజాగా సోష‌ల్ మీడియాలో అనుష్క పెట్టిన ఈ పోస్టే నిద‌ర్శ‌నం. ఇంత‌కంటే భ‌ర్త‌పై ఓ భార్య ప్రేమానురాగాల‌ను వ్య‌క్త‌ప‌రిచే భాష ఏదీ అని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తుండ‌డం విశేషం.