సమంత-చైతూ…వేరుకాపురం ?

ఇటీవల కొంత కాలంగా టాలీవుడ్ లో వినిపిస్తున్న హ్యాట్ గాసిప్ ఏదైనా వుందీ అంటే అది సమంత-చైతూ ల డివోర్స్ వ్యవహారమే. దీని పైనే ఎక్కువగా గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. కానీ చిత్రంగా ఇటు…

ఇటీవల కొంత కాలంగా టాలీవుడ్ లో వినిపిస్తున్న హ్యాట్ గాసిప్ ఏదైనా వుందీ అంటే అది సమంత-చైతూ ల డివోర్స్ వ్యవహారమే. దీని పైనే ఎక్కువగా గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. కానీ చిత్రంగా ఇటు చైతూ కానీ, అటు సమంత కానీ అస్సలు స్పందించలేదు. 

ఎవరో ఏదో అనుకుంటే అన్నింటికీ స్పందిస్తామా? ఏంటీ? అని అనుకోవచ్చు. కానీ మరీ ఇంతలా వస్తే కనీసం సెటైరికల్ గా అయినా ఓ పోస్ట్ అటు ఇన్ స్టాలో కానీ ఇటు ట్విట్టర్ లో కానీ కనిపించలేదు. పైగా ఈ వార్తలు ధృవీకరిస్తూ పలు పోస్ట్ లు సమంత వైపు నుంచి వచ్చాయి.

ఇప్పడు సమంత-చైతూ వేరు వేరుగా వుంటున్నారని వినిపిస్తోంది. ఇద్దరూ మ్యూచువల్ డైవోర్స్ కు దరఖాస్తు చేసేసారని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మ్యూచువల్ డైవోర్స్ కు అప్లయ్ చేయాలి. దానికి నిర్ణీతగడువు వుంటుంది. అఫీషియల్ గా కోర్టు అనుమతి వచ్చిన తరువాత ప్రకటన వుంటుందని, అంతవరకు ఇలా గ్యాసిప్ లు వినిపిస్తూ వుంటాయని అనుకోవాల్సిందే.

ప్రమోషన్లకు చైతూ

ఇదిలా వుంటే ఈనెల 24న చైతూ లవ్ స్టోరీ సినిమా విడుదల కాబోతోంది. ఆ సినిమా ప్రమోషన్లకు చైతూ మీడియా ముందుకు రాబోతున్నారు. ఈ మేరకు ఆయన నిర్మాతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

విశాఖలో కూడా ఓ ఈవెంట్ లేదా మీడియా మీట్ వుంటుంది. ఎక్కడో ఒక చోట ఈ గ్యాసిప్ కచ్చితంగా చైతూ దృష్టికి మీడియా తీసుకువస్తుంది. అప్పుడయినా స్పందించక తప్పదు. 

చెన్నయ్ లో సమంత?

సమంత ఇటీవల కొంతకాలం గోవాలో వుంచి వచ్చారు. ఇప్పుడు చెన్నయ్ లో వుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. చైతూ ఒంటరిగానే వుంటున్నారని టాక్. 

మొత్తం మీద 24 లోపు ఈ గ్యాసిప్ లు అన్నీ ప్యూర్ గ్యాసిప్ లేనా? నిజాలా అన్నది క్లారిటీ వచ్చేస్తుంది.