ప్రపంచ చాంఫియన్ అనిపించుకుని సరిగా పక్షం రోజులు అయినా గడవలేదు. ఇంతలోనే ఇంగ్లండ్ క్రికెట్ జట్లు బోల్తా పడింది. కనీసం ప్రపంచకప్ కు అర్హత సంపాదించలేకపోయిన జట్టు చేతిలో ఇంగ్లండ్ భంగపడింది. ఏ మైదానంలో అయితే ఇంగ్లండ్ జట్టు ప్రపంచకప్ విజేతగా నిలిచిందో, అదే మైదానంలో తమ సన్నిహిత దేశం ఐర్లాండ్ చేతిలో చిత్తు అయ్యింది!
కేవలం 85 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యింది ఇంగ్లిష్ జట్టు. ప్రపంచకప్ తర్వాత ఐర్లాండ్ తో టెస్ట్ ద్వారా మళ్లీ ఆట ప్రారంభించింది ఇంగ్లండ్. అది కూడా లార్డ్స్ వేదికగానే మ్యాచ్ మొదలైంది.టాస్ గెలిచి ఐర్లాండ్ బౌలింగ్ ను చీల్చిచెండాటమే పనిగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లిష్ జట్టు తోక ముడిచింది. కేవలం ఎనభై ఐదు పరుగులకు ఆలౌట్ అయ్యింది.
అలా ప్రపంచ చాంఫియన్ జట్టు తన స్టాండర్డ్స్ ఏ స్థాయిలో ఉన్నాయో చాటింది. ఏదో జాక్ పాట్ గా ప్రపంచకప్ గెలిచిందనే పేరును కలిగి ఉంది ఇంగ్లిష్ జట్టు. ఫైనల్లో స్కోర్స్ కూడా లెవల్ అయ్యాయి. దీంతో ఫేక్ చాంఫియన్ అనే విమర్శా ఉండనే ఉంది.
ఇంతలో ఐర్లాండ్ చేతిలో చిత్తు కావడం ఇంగ్లండ్ జట్టును మరింతగా నవ్వుల పాలయ్యేలా చేస్తూ ఉంది. కొసమెరుపు ఏమిటంటే.. ఇంగ్లండ్ 85 పరుగులకే ఆలౌట్ కాగా, తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన ఐర్లాండ్ నింపాదిగా ఆడుతోంది. ఇప్పటి వరకూ 138 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది ఐరిష్ జట్టు. తద్వారా యాభై పరుగులకు మించిన ఆధిక్యాన్ని సంపాదించింది.