‘అదేం గొప్ప కాదు చంద్రబాబు!’

''రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగడం ప్రత్యేక అర్హతేమీకాదు చంద్రబాబు గారూ. 40 ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకునే మీరు ప్రజల కోసం చేసిందేమీ లేదు. ఈ 40 ఏళ్ళలో కుటుంబ ఆస్తులను లక్ష రెట్లు పెంచుకున్నారు. రాష్ట్రాన్ని…

''రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగడం ప్రత్యేక అర్హతేమీకాదు చంద్రబాబు గారూ. 40 ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకునే మీరు ప్రజల కోసం చేసిందేమీ లేదు. ఈ 40 ఏళ్ళలో కుటుంబ ఆస్తులను లక్ష రెట్లు పెంచుకున్నారు. రాష్ట్రాన్ని రాబందులా పీక్కుతిన్నారు. భావితరాలకు మీ చరిత్ర మీరు అలానే గుర్తుండిపోతుంది.'' అంటూ  చంద్రబాబుపై విరుచుకుపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ లు చేస్తున్న విమర్శలపై విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. ''ప్రజలు అధికారం నుంచి ఎందుకు తరిమేశారో అర్థంకావడం లేదంటూ ప్రతిరోజూ మీ నాన్నారూ, మీరూ ఆడే డ్రామాలు ఇకచాలు. దోచుకోవడం, దాచుకోవడాన్ని వ్యవస్థీకృతం చేసిన చరిత్ర మీది. గ్రామ వలంటీర్ల ఇంటర్వ్యూలపై అభాండాలు వేస్తున్నావు. కావాలంటే దరఖాస్తు పెట్టుకుని ఇంటర్వ్యూకు వెళ్లిరా.

మూడేళ్లలో కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించి చూపిస్తామని జగన్ గారు చెప్పారు. శంకుస్థాపనల ముఖ్యమంత్రిగా మీరు తెచ్చుకున్న పేరు అలాగే ఉంటుంది టెన్షన్ పడకండి. ఆ రికార్డు మీకే సొంతం. జగన్ గారి ప్రభుత్వంలో ప్రతి పనికి రోజువారి ప్రోగ్రెస్ ఉంటుంది. చూస్తారుగా తొందరెందుకు?'' అంటూ చంద్రబాబు, లోకేష్ ల విమర్శలకు సమాధానం ఇచ్చారు విజయసాయి రెడ్డి.

ప్రత్యర్థులు ఏకమై సుధీర్ విజయాన్ని ఆపలేకపోయారు