Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఇసుకతో జాగ్రత్త జగన్.. అమలుకు ముందే అరాచకం

ఇసుకతో జాగ్రత్త జగన్.. అమలుకు ముందే అరాచకం

ఇసుక విధానం... ఇప్పటివరకూ ఇసుక సరఫరాలో ప్రభుత్వానికి మేలైన, వినియోగదారులకు చౌకైన విధానం కోసం అన్ని ప్రభుత్వాలు రకరకాల నిర్ణయాలు తీసుకున్నాయి. కానీ ఏ ఒక్కటీ సక్సెస్ కాలేదు. ఉచితంగా ఇసుక ఇస్తే, దళారులు బాగుపడతారు, ఇసుకపై సుంకం విధించి ప్రభుత్వమే విక్రయిస్తే వినియోగదారులు పూర్తిగా నష్టపోతారు. ఎలా చేసినా, ఏది చేసినా తిప్పలు తప్పవు. అయినా కూడా సీఎం వైఎస్ జగన్ ఇసుకపై సాహసోహేత నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వమే ఇసుక రీచ్ ల ద్వారా విక్రయాలు చేపట్టేలా నూతన విధానం రూపొందించారు ముఖ్యమంత్రి. దళారుల ప్రసక్తే లేకుండా నేరుగా వినియోగదారుడే ఆన్ లైన్లో ఇసుక కోసం ఆర్డర్ ఇచ్చేలా ఇసుక విధానాన్ని సులభతరం చేశారు. అయితే నూతన విధానం పట్టాలెక్కడానికి ఇంకా నెలన్నరకు పైగానే సమయం ఉంది. అయితే ఈ సంధి కాలంలోనే ప్రభుత్వానికి నష్టం జరిగేలా ఉంది.

ఇసుక విధానం ఫ్లాపయితే ప్రభుత్వాలు కూలిపోవు కానీ, చెడ్డపేరు రావడం మాత్రం గ్యారెంటీ. నిర్ణయం ఎంత మంచిదైనా అమలు విధానం బాగుంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. సరిగ్గా ఇక్కడే జగన్ సర్కార్ ఇరకాటంలో పడినట్టు కనిపిస్తోంది. గృహ నిర్మాణ అవసరాల కోసం ఇసుక కావాల్సినవారు అధికారుల దగ్గర అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ అనుమతి విధానంపై ప్రజల్లో అవగాహన లేదు. ఇక్కడే దళారీలు రంగప్రవేశం చేస్తున్నారు. అధికారులకు లంచాలిచ్చి అనుమతులు తీసుకుని వినయోగదారులకు ఇసుకను ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు.

పాత విధానంలో ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు కాగా, ఇప్పుడు కొత్త విధానం అమలులోకి రాబోయే ముందు ట్రాక్టర్ 3వేలు పలుకుతోంది. పూర్తిగా కొత్త విధానం అమలులోకి వచ్చి, పారదర్శకంగా పనులు జరిగే లోపు చాలామంది ఇసుక విషయంలో దారుణంగా మోసపోతున్నారు. దీనికి కారణం, అధికారులు, దళారులే. అయితే చెడ్డపేరు మాత్రం ప్రభుత్వానికి వస్తోంది.

దీన్ని నియంత్రించాలంటే మంత్రులు ప్రస్తుతం ఉన్న ఇసుక రవాణా విధానంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలి. గ్రౌండ్ లెవల్లో ఎలాంటి అక్రమాలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అవినీతిని అంతం చేయాలనే జగన్ ఆలోచన అమలులోకి వస్తుంది. ఇసుక పాలసీ అమలకు మార్గం సుగమం అవుతుంది.

ప్రత్యర్థులు ఏకమై సుధీర్ విజయాన్ని ఆపలేకపోయారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?