అప్పుడే ‘శ్రీకారం’ చుట్టిన శర్వానంద్

తీవ్రంగా గాయపడ్డాడు. పెద్ద సర్జరీ కూడా జరిగింది. 2 నెలలు విశ్రాంతి అవసరమని వైద్యులు కూడా హెచ్చరించారు. అంతలోనే కొత్త సినిమా స్టార్ట్ చేశాడు శర్వానంద్. అవును.. గాయం నుంచి త్వరగా కోలుకుంటున్న ఈ…

తీవ్రంగా గాయపడ్డాడు. పెద్ద సర్జరీ కూడా జరిగింది. 2 నెలలు విశ్రాంతి అవసరమని వైద్యులు కూడా హెచ్చరించారు. అంతలోనే కొత్త సినిమా స్టార్ట్ చేశాడు శర్వానంద్. అవును.. గాయం నుంచి త్వరగా కోలుకుంటున్న ఈ హీరో, ఈరోజు శ్రీకారం అనే సినిమాను స్టార్ట్ చేశాడు.

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాతో కిషోర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సుకుమార్ క్లాప్ కొట్టి ప్రారంభించాడు. అయితే ప్రస్తుతానికి ఇది ఓపెనింగ్ మాత్రమే. నెలరోజుల పాటు శర్వానంద్ రెస్ట్ తీసుకొని, ఆగస్ట్ నుంచి ఈ సినిమాను స్టార్ట్ చేస్తాడు. దాదాపు అదే టైమ్ లో 96 రీమేక్ కూడా మొదలవుతుంది.

ఈ సినిమాకు సంబంధించి మరో గమ్మత్తయిన విషయం ఏంటంటే.. ఈ సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. కుటుంబ కథాచిత్రం కావడంతో సంక్రాంతి సీజన్ బెస్ట్ అని భావిస్తున్నారు. కానీ సంక్రాంతికి ఇప్పటికే నాగార్జున, మహేష్, బాలయ్య సినిమాలు పోటీపడుతున్నాయి.

రామ్ ఆచంట, గోపీ ఆచంట కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించబోతున్నాడు. హీరోయిన్ ఎవరనే విషయాన్ని వచ్చేవారం ప్రకటించబోతున్నారు.

శర్వానంద్ సినిమా ఓపెనింగ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి

సమ్మర్‌కి బంపర్‌ బిగినింగ్‌! హడలెత్తించిన మార్చి! ఆల్‌టైమ్‌ డిజాస్టర్‌!