తరచూ వివాదాల్లో నిలుస్తూ ఉన్నారు రాధిక, శరత్ కుమార్. ఇప్పటికే తమిళ నటీనటుల సంఘానికి సంబంధించిన వ్యవహారాల్లో వీరు హాట్ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ప్రత్యేకించి విశాల్ మీద తరచూ వీరు తమ కామెంట్స్ తో అగ్గి రాజేస్తూ ఉంటారు.
ఇలాంటి క్రమంలో ఈసారి మరో వివాదంలో చిక్కుకున్నారు రాధిక, శరత్ కుమార్. ఒక చెక్కు బౌన్స్ కేసులో వీరి అరెస్టుకు కోర్టు నుంచి ఆదేశాలు రావడం గమనార్హం. దాదాపు రెండు కోట్ల రూపాయల మేర చెల్లింపుల వ్యవహారంలో వీరు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో వీరితో పాటు సినీ నిర్మాణం చేపట్టిన ఒక సంస్థ కోర్టుకు ఎక్కింది.
తమను రాధిక, శరత్ కుమార్ లు మోసం చేశారని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ కోర్టును కోరింది. ఆ పిటిషన్ పై విచారణకు రాధిక, శరత్ కుమార్ హాజరు కాకపోవడంతో.. కోర్టు వారి అరెస్టుకు ఆదేశాలు జారీ చేసింది.
సమ్మర్‌కి బంపర్ బిగినింగ్! హడలెత్తించిన మార్చి! ఆల్‌టైమ్ డిజాస్టర్!