గేమ్.. ఓవర్

మాంచి టాక్ వస్తే, మాంచి సమీక్షలు వస్తే, మాంచి రేటింగ్ లు వస్తే చాలు సినిమా దున్నేస్తుంది అని ఓ స్థిర అభిప్రాయం వుంది టాలీవుడ్ లో. అయితే సమీక్షలు, రేటింగ్ లు అనేవి…

మాంచి టాక్ వస్తే, మాంచి సమీక్షలు వస్తే, మాంచి రేటింగ్ లు వస్తే చాలు సినిమా దున్నేస్తుంది అని ఓ స్థిర అభిప్రాయం వుంది టాలీవుడ్ లో. అయితే సమీక్షలు, రేటింగ్ లు అనేవి జొనర్ ను బట్టి, వైవిధ్యాన్ని బట్టి, కంటెంట్ ను బట్టి కూడా వుంటాయి. సమీక్షకులకు నచ్చిన సినిమా జనాలకు నచ్చాలని లేదు. సమీక్షకులకు నచ్చని సినిమా జనాలు చూడరని లేదు. 

ఈవారం విడుదలైన గేమ్ ఓవర్ సినిమా పరిస్థితి ఇదే. సమీక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. కానీ ప్రేక్షకులు మాత్రం పెదవి విరిచారు. బాగుందనే మౌత్ టాక్ అక్కడక్కడ వినిపించింది కానీ థియేటర్లకు దగ్గర కలెక్షన్లు నాలుగు అంకెలను దాటలేదు. పట్టణ ప్రాంతాల్లోనే అయిదు అంకెలు కాస్త అక్కడక్కడ కనిపించాయి.

సీజన్ సరైనది కాకపోవడం, సినిమా బి సి సెంటర్లకు అంతగా పట్టకపోవడంతో, సరైన కలెక్షన్లు నమోదు కాలేదని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. నిజానికి తాప్సీ మంచి నటన కనబర్చింది. సినిమా టేకింగ్ కొత్తగా వుంది. అందువల్ల మంచి సమీక్షలు, మంచి రేటింగ్ లు వచ్చాయి. కానీ కామన్ ఆడియన్స్ మాత్రం సినిమాకు దూరంగా వుండిపోయారు. దాంతో గేమ్ ఓవర్ అయిపోయింది.

ఆత్మవిమర్శ అవసరం.. దిక్కుతోచని స్థితిలోనే ఈ పనులు