డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్.. లాంఛనమే!

ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇది దాదాపుగా లాంఛనమైన ప్రక్రియ అని వేరే చెప్పనక్కర్లేదు. Advertisement సభలో బలాబలాల…

ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇది దాదాపుగా లాంఛనమైన ప్రక్రియ అని వేరే చెప్పనక్కర్లేదు.

సభలో బలాబలాల దృష్ట్యా అధికార పక్షం అనుకున్న వాళ్లే డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఆ హోదాను బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి కేటాయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారని ఇది వరకే వార్తలు వచ్చాయి.

కోన రఘుపతి డిప్యూటీ స్పీకర్ గా ఎన్నిక కావడం దాదాపు లాంఛనమే. గతంలో కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకర్ రావు ఏపీ అసెంబ్లీకి స్పీకర్ గా వ్యవహరించారు. ఇప్పుడు రఘుపతి డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించబోతూ ఉండటం గమనార్హం.

బాబు అప్పుడే ఇలా ఆలోచించి ఉంటే ఫలితముండేదేమో!