ఏ మహిళైనా తాను తల్లి అవుతున్నానంటే ఎంతో ఆనందపడుతుంది. జీవితంలో అంతకంటే మధుర క్షణాలు స్త్రీ జీవితంలో ఉండవు. బిడ్డకు జన్మనిచ్చే రోజు కోసం ఏ మహిళైనా తహతహలాడుతుంది. కానీ ఓ సెలబ్రిటీ మహిళ మాత్రం ఇందుకు విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం చర్చకు దారి తీసింది.
బాలీవుడ్ నటి పూనమ్ పాండే తనకు గర్భందాల్చే వార్త అత్యంత బాధ కలిగించే అంశమని చెప్పి ఆశ్చర్యపరిచారు. పూనమ్.. దర్శకుడు సామ్ బాంబేను గతేడాది సెప్టెంబర్ 1న పెళ్లాడారు. పెళ్లైన నెల రోజులకే భర్త చిత్రహింసలు పెడుతున్నాడంటూ అతడిపై గృహహింస కేసు పెట్టారు. ఆ తర్వాత మళ్లీ వెనక్కి తగ్గారు.
జీవితంలో ఇలాంటి చిన్నచిన్న గొడవలు సాధారణమే అని సర్ది చెప్పుకుని అతనితో కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పూనమ్ త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. ఆమె అభిమానులు సంతోషించారు.
తాజాగా పూనమ్ తన గర్భంపై బాంబు పేల్చారు. తాను గర్భవతి అనే వార్తలో ఎంత మాత్రం నిజం లేదని చెప్పి షాక్ ఇచ్చారు. ఇలాంటి కథనాల ద్వారా అనవసరంగా తనను గర్భవతి చేయకండని ఆమె వ్యంగ్యంగా అన్నారు.
ప్రెగ్నెంట్ అని తెలియగానే ప్రతి మహిళ సంబరపడుతుందని, కానీ తన విషయంలో అలా జరగడం లేదని పూనమ్ చెప్పు కొచ్చారు. ఎందుకంటే తాను గర్భవతిని కాదు కాబట్టి అని ఆమె స్పష్టత ఇచ్చారు.
ఇలాంటి సున్నిత అంశాలపై తన నుంచి క్లారిటీ తీసుకుని రాస్తే బాగుంటుందని ఆమె కోరారు. తన జీవితం తెరిచిన పుస్తకం అని తెలిపారు. నిజంగా గర్భం దాల్చిన రోజు అందరికీ మిఠాయిలు పంచుతానని పూనమ్ పేర్కొనడం విశేషం.