సరైన విజయాలు లేక, వెనుకబడ్డ హీరో రాజ్ తరుణ్ కు మళ్లీ మంచి రోజులు స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఓ సినిమాను దిల్ రాజు బ్యానర్ లో ఓకె చేసారు. కృష్ణారెడ్డి దర్శకుడు. ఇదికాక మరో సినిమా కూడా రాజ్ తరుణ్ దగ్గరకు వచ్చింది. సీనియర్ ప్రొడ్యూసర్ రాధామోహన్ నిర్మాత. గతంలో రెండు మంచి సినిమాలు అందించిన కొండా విజయ్ కుమార్ దర్శకుడు.
ముందుగా దిల్ రాజు సినిమా ఈనెలలో లేదా వచ్చే నెలలో ఫుల్ గా సెట్ మీదకు వెళ్లి, ఆగస్టు తరువాత రెండో సినిమా స్టార్ట్ అవుతుంది. ఇదిలావుంటే కొండా విజయ్ కుమార్ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో నిత్యమీనన్ హీరోయిన్ అంటూ వినిపించడం ప్రారంభమైంది.
అయితే నిత్యా మీనన్ చేయడంలేదని, చేసే అవకాశం లేదని తెలుస్తోంది. నిత్య ప్రస్తుతం అమెజాన్ ప్రయిమ్ కు వెబ్ సిరీస్ లు చేయడంలో, మలయాళంలో ఓ స్పోర్ట్స్ డ్రామా చేయడంలో బిజీగా వుందట. అందువల్ల ఆమె తెలుగులో చేసే అవకాశమే లేదని తెలుస్తోంది.