ఐమాక్స్ అనగానే హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ నే గుర్తుకువస్తుంది. అతిపెద్ద స్క్రీన్ వున్న ఐమాక్స్ థియేటర్ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో అదే. ఇప్పుడు అంతకు మించిన ఐమాక్స్ స్క్రీన్ రాబోతోంది. అల్లు అరవింద్, అల్లు అర్జున్, సునీల్ నారంగ్ కలిసి నిర్మించబోయే మాల్ ప్లస్ మల్టీ ప్లెక్స్ లో అతి పెద్ద ఐమాక్స్ తెర ఏర్పాటు చేస్తారట.
నగరం నడిబొడ్డులోని అమీర్ పేట సత్యం థియేటర్ స్థలాన్ని అల్లు అరవింద్ తీసుకున్నారని తెలుస్తోంది. ఈ ఏడువేల గజాల స్థలంలో మాల్ కమ్ మల్టీ ఫ్లెక్స్ నిర్మాణం చేపడతారు. అయిదు స్క్రీన్ల మల్టీ ఫ్లెక్స్ లో ఒకటి ఐమాక్స్ తెర వుంటుంది. ఈ తెర ప్రస్తుతం వున్న ప్రసాద్ ఐమాక్స్ తెరకన్నా పెద్దదిగా వుంటుందట.
అమీర్ పేట అంటే యూత్ కు సెంటర్. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ యూత్ అంతా అక్కడే ఎక్కువగా కనిపిస్తారు. ఇలాంటి చోట్ల మాల్ కమ్ మల్టీ ఫ్లెక్స్ అంటే కచ్చితంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా వుంటుంది. ఇప్పటికే అమీర్ పేట సమీపంలో బిగ్ సినిమాస్, పివీఆర్ మల్టీ ఫ్లెక్స్ లు వున్నాయి. మరో రెండేళ్లకు అల్లువారి మాల్ కమ్ మల్టీ ఫ్లెక్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం వుంది.
భేకార్ మాటల్.. థియేటర్స్ గుప్పిట్లో పెట్టుకుని డ్యాన్స్ ఏస్తామా