తన తాజా ప్రేయసితో హ్యాపీగా ఫొటోలు దిగుతున్నాడు ఫర్హాన్ అక్తర్. తన మొదటి భార్యతో విడిపోయిన ఈ దర్శకనటుడు.. శివానీ దండేకర్ అనే వీజే, టీవీ హోస్టుతో ప్రేమాయణాన్ని నడిపిస్తున్నాడు. ఈ విషయాన్ని వీరిద్దరూ ధ్రువీకరించినట్టే. కొన్ని రోజుల కిందట శివానీ తన ఇన్ స్టాగ్రమ్ పేజ్ లో ఫర్హాన్ అక్తర్ తో దిగిన ఫొటోను పోస్టు చేసింది. ఇక తాజాగా వీరిద్దరూ బయట తిరుగుతూ మీడియా కంట పడ్డారు. ఈ విధంగా వీరి బంధం పై ధ్రువీకరణ వచ్చినట్టే అని బాలీవుడ్ మీడియా అంటోంది.
మొత్తానికి ఫర్హాన్ అక్తర్ ఇలా కొత్త గర్ల్ ఫ్రెండ్ తో సెట్ కావడంతో.. శ్రద్ధా కపూర్ పై రూమర్లు ఆగిపోయినట్టే. సాహోలో హీరోయిన్ గా నటిస్తున్న శ్రద్దా విషయంలో మొన్నటి వరకూ ఉండిన రూమర్..ఈమె ఫర్హాన్ అక్తర్ తో ప్రేమలో ఉంది అనేది. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగినట్టుగా వార్తలు వచ్చాయి.
ఫర్హాన్ ఫ్లాట్ లోనే శ్రద్ధా కపూర్ మకాం పెట్టిందని కూడా బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. హీరోయిన్ గా మంచి భవిష్యత్తును కలిగిన శ్రద్ధ అలా ఫర్హాన్ వద్ద చిక్కుబడిపోయిందని కొంతమంది సానుభూతి కూడా వ్యక్తం చేశారు. ఇక ఆ బంధం శ్రద్ధా తండ్రి శక్తి కపూర్ కు ఏ మాత్రం ఇష్టం లేదని.. ఆమను ఈ విషయంలో ఆయన వారిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయినా శ్రద్ధా వినడం లేదని కూడా బాలీవుడ్ మీడియా పేర్కొంటూ వచ్చింది.
ఇక అలాంటి రూమర్లన్నింటికీ ఇక ఫుల్ స్టాప్ పడినట్టే. ఫర్హాన్ అక్తర్ కొత్త ప్రేమకథను ధ్రువీకరించడంతో.. ఇక శద్ధా కపూర్ , ఫర్హాన్ కు ప్రేమ అనే రూమర్లు పూర్తిగా ఆగిపోయే అవకాశాలున్నాయి.
అన్ని దోశలు ఎలా వేశావ్ భయ్యా.. ఆకలేసి ఫన్నీ వీడియో
కేసీఆర్‌లా గెలిచినట్టుగా గెలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్