బయోపిక్.. వీవీఎస్ లక్ష్మణ్ ఆ హీరోపై ఆశలు!

తన బయోపిక్ విషయంలో ఇదివరకూ కొందరు దర్శక, నిర్మాతలు స్పందించారని చెప్పాడు వంగివరపు వెంకటసాయి లక్ష్మణ్. ఈ హైదరాబాదీ సొగసరి బ్యాట్స్ మన్ తాజాగా తన బయోగ్రఫీ విడుదల చేశారు. తన జీవితంలోని వివిధ…

తన బయోపిక్ విషయంలో ఇదివరకూ కొందరు దర్శక, నిర్మాతలు స్పందించారని చెప్పాడు వంగివరపు వెంకటసాయి లక్ష్మణ్. ఈ హైదరాబాదీ సొగసరి బ్యాట్స్ మన్ తాజాగా తన బయోగ్రఫీ విడుదల చేశారు. తన జీవితంలోని వివిధ అంశాలను అందులో పేర్కొన్నాడు.

ఇదివరకూ చాలామంది భారత క్రికెటర్లు ఇలా బయోగ్రఫీలను ఆవిష్కరించారు. ఆ జాబితాలో లక్ష్మణ్ కూడా చేరారు. ఈ క్రికెటర్ బయోగ్రఫీకి అంతర్జాతీయంగా క్రికెట్ ప్రియులందరిలోనూ ఆసక్తి ఉంది. ఆ సంగతలా ఉంటే.. బయోగ్రఫీ కూడా వచ్చేసింది కదా, బయోపిక్ అంటూ మీడియా లక్ష్మణ్ ను కదిలించింది.

ఇదివరకే కొందరు మూవీ మేకర్లు ఈ విషయంలో తనను సంప్రదించారని లక్ష్మణ్ అన్నాడు. అయితే అప్పట్లో తను పట్టించుకోలేదని.. బయోగ్రఫీ వచ్చాకా.. బయోపిక్ చేస్తే బావుంటుందేమో అనే ఆలోచనను వ్యక్తం చేశాడు వీవీఎస్.

మరి అందులో నటించడానికి తగిన హీరో ఎవరు అంటే.. ప్రిన్స్ మహేశ్ బాబు పేరు చెప్పాడు ఈ స్టార్ క్రికెటర్. స్వతహాగా తను మహేష్ బాబు అభిమానిని అని లక్ష్మణ్ చెప్పాడు. మహేశ్ సినిమాలను చూసి తను ఎంజాయ్ చేస్తానని అన్నాడు.

తన బయోపిక్ తీస్తే అందులో మహేశ్ నటిస్తే బావుంటుందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. మంచి ఛాయిసే.. మరి లక్ష్మణ్ బయోపిక్ ను ఎవరైనా పట్టాలెక్కిస్తారా లెట్స్ సీ!

బిడ్డా రాస్కో.. తెలంగాణ‌లో అధికారం మాదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్