ఒక్కోసారి ఒక్కో సినిమాకు అనుకోకుండా అలా బజ్ వచ్చేస్తుంది బాహుబలి హ్యాంగోవర్ కావచ్చు. సినిమాకు వదిలిన టీజర్లు, ఫస్ట్ లుక్ లు, ట్రయిలర్ల వల్ల కావచ్చు. మాంచి క్రేజ్ వచ్చేసింది.
ఎంత క్రేజ్ వచ్చేసింది అంటే టోటల్ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం ఒక్క డిజిటల్, శాటిలైట్ రైట్స్ తోనే వచ్చేస్తోంది. తేజ-రానా కాంబినేషన్ లో వస్తున్న నేనే రాజు-నేనే మంత్రి సినిమాకు టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ 20 కోట్లు అయింది.
శాటిలైట్ ఆల్ లాంగ్వేజెస్, అమెజాన్ డిజిటల్ రైట్స్ అన్నీ కలిపి 20 కోట్లు అంచనా వేస్తున్నారు. కాస్త తగ్గినా 16కు పైనే వస్తుంది. అంటే ఇంక థియేటర్ హక్కులు లాభంగా మిగిలిపోతాయన్నమాట. అందుకే సినిమాను అమ్మాలా? వద్దా? అన్న డిస్కషన్లు సాగుతున్నాయి.
సినిమాను నిర్మిస్తున్న బ్లూ ప్లానెట్ కు స్వంత డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ వుండడం, పైగా సురేష్ మూవీస్ సురేష్ బాబు పార్టనర్ కావడం, ఆయనకు పంపిణీ వ్యవస్థ వుండడం వల్ల అమ్మకుండా నేరుగా పంపిణీచేసే ఆలోచనలో వున్నారు. కానీ ఇప్పటికి వచ్చిన బజ్ పుణ్యమా అని మాంచి రేట్లే పలుకుతున్నాయి.