సౌండ్‌ లేదేంటి రాధా?

శర్వానంద్‌ వరుస విజయాల మీదున్న సంగతి నిజమే కానీ, అతని గత చిత్రాల ఫలితాల వల్ల కొత్త చిత్రాలకి జనం క్యూ కట్టేసే పరిస్థితి లేదు. ఇప్పటికీ శర్వానంద్‌ సినిమాలు సర్వయివ్‌ అయ్యేది ఆకట్టుకునే…

శర్వానంద్‌ వరుస విజయాల మీదున్న సంగతి నిజమే కానీ, అతని గత చిత్రాల ఫలితాల వల్ల కొత్త చిత్రాలకి జనం క్యూ కట్టేసే పరిస్థితి లేదు. ఇప్పటికీ శర్వానంద్‌ సినిమాలు సర్వయివ్‌ అయ్యేది ఆకట్టుకునే కథల మీదే. శర్వానంద్‌ గత చిత్రం 'శతమానం భవతి' భారీ విజయాన్ని అందుకోవడంతో 'రాధ' చిత్రం హక్కులని ఫ్యాన్సీ ఆఫర్లు ఇచ్చి తీసేసుకున్నారు.

ఇంతవరకు బాగానే వుంది కానీ ఈ చిత్రానికి పబ్లిసిటీ దాదాపు ఆబ్సెంట్‌ అనే చెప్పాలి. మార్చిలోనే విడుదల కావాల్సిన చిత్రాన్ని మే నెలకి వాయిదా వేసిన నిర్మాతలు అప్పట్నుంచి పబ్లిసిటీ పరంగా కేర్‌ తీసుకోవడం లేదు. ఏదో స్టార్‌ హీరో సినిమా అన్నట్టు ఆడియో ఫంక్షన్‌ కూడా చేయకుండా పాటలు డైరెక్టుగా మార్కెట్లోకి వదిలేసారు.

వచ్చే వారమే విడుదల కాబోతున్న 'రాధ' ప్రస్తుతం మినిమమ్‌ సౌండ్‌ కూడా చేయడం లేదు. అసలే 'బాహుబలి' జోరు ఇప్పట్లో తగ్గేట్టు కనిపించడం లేదు. ఈ టైమ్‌లో మరో సినిమా వైపు జనం దృష్టిని తిప్పాలంటే దండోరా తీవ్ర స్థాయిలో వెయ్యాలి. కానీ పబ్లిసిటీ పరంగా నిర్మాతలు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. చివరి వారం రోజుల్లో అయినా పబ్లిసిటీ తీవ్రతరం చేసి పబ్లిక్‌ దృష్టిలో పడతారో లేదో మరి.