నేటి థర్టీ లోపు యువతరానికి టీనేజ్ సెలబ్రిటీ క్రష్ .. ఇలియానా!
‘దేవదాసు’లో అప్పటికే నటించి ఉన్నా, ‘పోకిరి’ లో ఈ గోవా సుందరి ని చూసి నాటి టీనేజర్లు కలవరపడ్డారు! ఏలియన్ నా… ఇలియానా నా? అని గిచ్చి చూసుకున్నారు!
ఇప్పుడు ఆ విషయాలను చెప్పుకునే ఇలియానా ఇన్ స్టాగ్రమ్ అకౌంట్ లో వేదన వ్యక్తం చేస్తున్నారు వీళ్లు. “నువ్వు నా ఫస్ట్ అండ్ లాస్ట్ క్రష్.. ప్లీజ్ ఇలా చేయకు..’’ అంటూ వాళ్లు కామెంట్లు పెడుతున్నారు!
మొన్నటి వరకూ ఈ భామ ఇన్ స్టాగ్రమ్ లో తన ఫొటోలను పోస్టు చేస్తుంది.. వాటిని చూస్తూ ఆరాధించేయవచ్చు.. అని అక్కడ కాచుక్కుర్చున్న అభిమానులకు ఇలియానా ఒక షాకే ఇచ్చింది. అదేమనగా.. బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ లో మునిగి తేలుతూ ఒక వీడియోను కంపోజిషన్ ను పోస్టు చేసింది. ఇంకేముంది.. చాలా మంది గుండెలు ద్రవించిపోతున్నాయి. తన కలల సుందరి పెదాల మీద వేరొకరు అలా చుంభించేస్తుంటే, ఆమె దాన్ని ఆస్వాధిస్తుంటే.. అంత కన్నా విషాదం ఏముంది!
ఇప్పుడు ఇలియానా అభిమానులు ఈ తరహా విషాదసాగరంలోనే మునిగితేలుతున్నారు. ఇప్పటికే తన బాయ్ ఫ్రెండ్ గురించి బోలెడన్ని వివరాలు చెప్పింది ఇలియానా. తను అతడిని పెళ్లి చేసుకోను అని.. డేటింగ్ మాత్రమే అని కూడా స్పష్టత ఇచ్చింది!