Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ ముగ్గురి బంధం మరింత గట్టిపడింది

ఆ ముగ్గురి బంధం మరింత గట్టిపడింది

త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ విడదీయలేని బంధం. నితిన్-పవర్ స్టార్..భగవంతుడు, భక్తుడిలాంటి బంధం. ఇప్పుడు ఈ బందాలు పెనవేసుకుని ముప్పేటగా మారి ముచ్చటగా సినిమా నిర్మాణంలోకి దిగాయి.

ఎప్పటి నుంచో త్రివిక్రమ్ సినిమా నిర్మాణంలోకి రావాలనుకుంటున్నారు. ఇప్పటికే హారిక హాసినిలో పరోక్ష భాగస్వామిగా వున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే సినిమా నిర్మాణంలో వుండనే వున్నారు. ఇక నితిన్ తండ్రి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. సో, ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి నితిన్ హీరోగా సినిమా ప్రారంభిస్తున్నారట. ఈ విషయాన్ని నితిన్ నే స్వయంగా ట్వీట్ చేసాడు.

చిత్రమేమిటంటే రచయిత త్రివిక్రమ్ సినిమా నిర్మాణ భాగస్వామి అయితే, పాటలు, మాటల రచయిత కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకుడు. మెయిన్ పాయింట్ ను మాత్రం దర్శకుడు త్రివిక్రమ్ సమకూరుస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?