దాదా సౌరవ్ గంగూలీ పెద్ద షాకే ఇచ్చాడు రవిశాస్త్రికి. అలా ఇలా కాదు, 'పిచ్చోళ్ళ ప్రపంచంలో వున్నట్టున్నాడు..' అనడం ద్వారా నిజంగానే రవిశాస్త్రిని పిచ్చోడని కన్‌ఫర్మ్ చేసేశాడు సౌరవ్ గంగూలీ. ఈ వయసులో రవిశాస్త్రికి ఈ వివాదాలు, అవమానాలు అవసరమా.? ప్చ్, రవిశాస్త్రి అంటే ఇష్టపడని క్రికెట్ అభిమాని వుండడు ఇండియాలో.. అలాంటి రవిశాస్త్రికి ఎందుకొచ్చిన అవమానాలివి.!
మొదట మాటల యుద్ధం స్టార్ట్ చేసిందే రవిశాస్త్రి. సౌరవ్ గంగూలీ తీరు తనకు నచ్చలేదనీ, కోచ్‌ని ఎంపిక చేసేటప్పుడు ఆ ఇంటర్వ్యూకి తాను హాజరైనా, సౌరవ్ గంగూలీ తనను ఇంటర్వ్యూ చేయడానికి రాలేదని రవిశాస్త్రి నిప్పు రాజేశాడు. 'గంగూలీకి ఇది తగదు, మర్యాద అసలే కాదు. నా లాంటి సీనియర్‌ని గౌరవించే పద్ధతి ఇది కాదు..' అని రవిశాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. పోన్లే సీనియర్ కదా.. అనుకున్నాడో ఏమో, రవిశాస్త్రి వ్యాఖ్యల్ని గంగూలీ లైట్ తీసుకున్నాడు.
మామూలుగా అయితే మైదానంలో అయినా, ఇంకెక్కడైనా చాలా ఎగ్రెసివ్‌గా వుంటాడు గంగూలీ. ఎందుకో, శాస్త్రి విషయంలో కాస్త ఆచి తూచి వ్యవహరించాలనుకున్నాడు. కానీ, గంగూలీ మెంటాలిటీ బాగా తెలిసినోడు కదా.. రెచ్చగొట్టాడు, ఫలితం అనుభవిస్తున్నాడిప్పుడు రవిశాస్త్రి. ప్రస్తుతానికైతే గంగూలీ – రవిశాస్త్రి వివాదంతో టీమిండియాకి వచ్చే నష్టమేమీ లేదు. కానీ, తనకున్న పరిచయాలతో రవిశాస్త్రి, బిసిసిఐలో పట్టు సాధిస్తే మాత్రం వీరి గొడవ టీమిండియాకి తలనొప్పిగా మారే ప్రమాదం లేకపోలేదు.
ఏదో లైట్ తీసుకోవడమో, లైట్‌గా ఖండించేయడమో చేయకుండా, సౌరవ్ గంగూలీ కూడా రవిశాస్త్రి సీనియారిటీని లెక్క చేయకుండా 'పిచ్చోళ్ళ లోకంలో వున్నాడు..' అనడమేంటి.? ఇది కాస్త ఓవర్. 'నేను ఇంటర్వ్యూ చెయ్యడానికి రాలేదంటున్నాడు.. బీసీసీఐకి ఈ విషయమై ముందస్తు సమాచారం ఇచ్చాను.. అభ్యర్థిగా రవిశాస్త్రి ప్రత్యక్షంగా ఇంటర్వ్యూకి హాజరవకపోవడమేంటి.?' అంటూ లాజికల్‌గానే సౌరవ్ గంగూలీ, రవిశాస్త్రికి ఝలక్ ఇచ్చాడు.
ఇక, ఈ పిచ్చోళ్ళ లోకంలో డైలాగులపై రవిశాస్త్రి ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.