ఆలు లేదు..చూలు లేదు..పిల్లాడికి పేరు డిసైడ్ అయిపోయిందన్నట్లుగా వుంది బాలీవుడ్ సినిమా బ్రదర్స్ వ్యవహారం. ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో విడుదల కాబోతోంది. దీన్ని తెలుగు తమిళంలో రీమేక్ చేయాలని అదే నిర్మాణ సంస్థ ఆలోచిస్తోందని వదంతులు వచ్చేసాయి. పైగా నటీనటులను కూడా డిసైడ్ చేసేసారు.
తెలుగులో రామ్ చరణ్, ప్రభాస్, రానా అంట, తమిళనాట సూర్య, కార్తి, విక్రమ్ అంట. జరిగే వ్యవహారం, కుదిరే సంగతేనా? ఇలాంటి కాంబినేషన్ లు తెలుగులో సెట్ కావాలంటే చాలా ఈక్వేషన్లు కుదరాలి. నిర్మాత, డైరక్టర్, తెరవెనుక సంగతులు చాలా వుంటాయి. మన దగ్గర మల్టీ స్టారర్లు కుదరాలంటే చిన్న వ్యవహారం కాదు. పైగా రాజమౌళి లాంటి డైరక్టర్లకు ఇది సాధ్యం కావచ్చు.
ఇక్కడ పేమెంట్ ఒక్కటే వ్యవహారం కాదు. అది ఒక్కటే అయితే ఈ పాటికి ఇంతకన్నా పెద్ద కాంబినేషన్లు సెట్ అయిపోను. కానీ ఇక్కడ ఫ్యాన్స్, ఇతరత్రా వ్యవహారాలు వుంటాయి. పైగా ప్రభాస్ మరో రెండేళ్ల వరకు ఖాళీ లేడు. రామ్ చరణ్ ది కూడా అదే పరిస్ఢితి. ఈలోగా ఇలాంటి వార్తలు వదంతులుగానే వుండిపోతాయి.