చురుక్కులుః నాలో కొత్త న‌టున్ని చూస్తారు

1). తెలంగాణాలో అన్నీ ఒకే కుటుంబానికి ద‌క్కాయి – రాహుల్‌ -దేశంలో అన్నీ మీ కుటుంబానికే ద‌క్కిన‌ట్టు Advertisement 2). రాజ‌ద్రోహం చ‌ట్టం వుండాల్సిందే –కేంద్రం -బిజెపిని విమ‌ర్శించే వాళ్లంతా  రాజ‌ద్రోహులే క‌దా! 3).…

1). తెలంగాణాలో అన్నీ ఒకే కుటుంబానికి ద‌క్కాయి – రాహుల్‌ -దేశంలో అన్నీ మీ కుటుంబానికే ద‌క్కిన‌ట్టు

2). రాజ‌ద్రోహం చ‌ట్టం వుండాల్సిందే –కేంద్రం -బిజెపిని విమ‌ర్శించే వాళ్లంతా  రాజ‌ద్రోహులే క‌దా!

3). ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచే రాహుల్‌కి స్క్రిప్ట్ – బండి సంజ‌య్‌ -బండి రాంగ్ రూట్‌లో వెళుతోంది

4). రాహుల్‌తో గ‌ద్ద‌ర్ భేటీ –దారి త‌ప్పిన ప్ర‌జాయుద్ధ నౌక‌

5). రాజ‌కీయాల్ని వ్యాపారంగా నేనెన్న‌డూ చూడ‌లేదు –చంద్ర‌బాబు -వ్యాపార రాజ‌కీయాల‌కి మీరు ఆదిగురువు క‌దా బాబూ!

6). ఢిల్లీకి రావ‌ద్దు – రాహుల్‌ -ఎందుకంటే ఆయ‌న ఎక్కువ‌గా విదేశాల్లోనే వుంటాడు

7). రాజ‌కీయ‌మంటే –పులి మెడ‌లో రుద్రాక్ష‌మాల వుండ‌డం 

8). టికెట్ ధ‌ర‌ల పెంపుపై ప్రేక్ష‌కుడి కామెంట్‌ -స‌ర్కార్ వారి పాట‌కు స‌ర్కార్ వారి సాయం

9). ఫంక్ష‌న్ల రొటీన్ డైలాగ్‌ -మీరు నాలో కొత్త న‌టున్ని చూస్తారు

10). టూరిజం మంత్రి రోజా ఏం చేస్తున్నారు –ఆశీర్వాదాల టూర్‌లో వున్నారు

జీఆర్ మ‌హ‌ర్షి