1). తెలంగాణాలో అన్నీ ఒకే కుటుంబానికి దక్కాయి – రాహుల్ -దేశంలో అన్నీ మీ కుటుంబానికే దక్కినట్టు
2). రాజద్రోహం చట్టం వుండాల్సిందే –కేంద్రం -బిజెపిని విమర్శించే వాళ్లంతా రాజద్రోహులే కదా!
3). ప్రగతి భవన్ నుంచే రాహుల్‌కి స్క్రిప్ట్ – బండి సంజయ్ -బండి రాంగ్ రూట్లో వెళుతోంది
4). రాహుల్‌తో గద్దర్ భేటీ –దారి తప్పిన ప్రజాయుద్ధ నౌక
5). రాజకీయాల్ని వ్యాపారంగా నేనెన్నడూ చూడలేదు –చంద్రబాబు -వ్యాపార రాజకీయాలకి మీరు ఆదిగురువు కదా బాబూ!
6). ఢిల్లీకి రావద్దు – రాహుల్ -ఎందుకంటే ఆయన ఎక్కువగా విదేశాల్లోనే వుంటాడు
7). రాజకీయమంటే –పులి మెడలో రుద్రాక్షమాల వుండడం
8). టికెట్ ధరల పెంపుపై ప్రేక్షకుడి కామెంట్ -సర్కార్ వారి పాటకు సర్కార్ వారి సాయం
9). ఫంక్షన్ల రొటీన్ డైలాగ్ -మీరు నాలో కొత్త నటున్ని చూస్తారు
10). టూరిజం మంత్రి రోజా ఏం చేస్తున్నారు –ఆశీర్వాదాల టూర్లో వున్నారు
జీఆర్ మహర్షి