బాలయ్య..మజాకానా?

బాలకృష్ణ అంటే సినిమాలో విలన్లే కాదు, సినిమా రంగంలో కూడా జనాలకు కాస్త భయం భక్తీ వుంటాయి. ఇప్పుడు అది మరోసారి రుజువయింది. లయన్ అడియో ఫంక్షన్ లో నటుడు ఆలీ ద్వారా..  …

బాలకృష్ణ అంటే సినిమాలో విలన్లే కాదు, సినిమా రంగంలో కూడా జనాలకు కాస్త భయం భక్తీ వుంటాయి. ఇప్పుడు అది మరోసారి రుజువయింది. లయన్ అడియో ఫంక్షన్ లో నటుడు ఆలీ ద్వారా..   ఈ అడియో ఫంక్షన్ కు ఆలీ యాంకర్ గా వచ్చాడు.పక్కన కో యాంకర్ జబర్దస్త్ అనసూయ. వీరిద్దరు కలిస్తే ఎలా రెచ్చిపోతారో అనుకున్నారు జనం. 

ఎందుకంటే ఆలీ డబుల్ మీనింగ్ సెటైర్లు అందిరికీ అనుభవమే. సమంత బొడ్డు ఏరియా విజయవాడ బెంజ్ సర్కిల్ లా వుంటుందని అన్నాడు మొన్నటికి మొన్నే. కానీ చిత్రంగా లయన్ అడియో ఫంక్షన్ లో మాత్రం ఎక్కడా డబుల్ మీనింగ్ లు లేవు. నోరు చాలా కంట్రొల్ లో వుంచుకున్నాడు. 

బహుశా బాలయ్య బాబు దగ్గర ఇలాంటివి కనిపించినా, వినిపించినా, తరువాతి ఫంక్షన్ కు చాన్సివ్వరని భయపడ్డాడేమో?