నటన తక్కువ ఆశ ఎక్కువ

రోజుకో బంగారు గుడ్డు పెట్టే బాతుని దురాశకు పోయి ఒకే రోజు బంగారు గుడ్లన్నీ పొందాలని దాన్ని చంపి చూస్తే రేపు పెట్టబోయే ఒక గుడ్డే మిగిలి వుందని మనకు ఒక పాఠం కూడా…

రోజుకో బంగారు గుడ్డు పెట్టే బాతుని దురాశకు పోయి ఒకే రోజు బంగారు గుడ్లన్నీ పొందాలని దాన్ని చంపి చూస్తే రేపు పెట్టబోయే ఒక గుడ్డే మిగిలి వుందని మనకు ఒక పాఠం కూడా వుండేది. ఈ పాఠం సెక్సీ హీరోయిన్‌ శృతిహాసన్‌కి తెలియనట్టుంది. అసలు శృతిహాసన్‌ కేవలం డబ్బు సంపాదనకే హీరోయిన్‌ అయినట్లు కనిపిస్తుంది తప్ప ఎక్కడా నటన మీద కమిట్‌మెంటు వున్న దాఖలాలయితే కనబడవు ఆమెలో. 

డబ్బులు తీసుకుని షూటింగ్స్‌కి రావడంలేదని ఒక నిర్మాత కేసు పెట్టి, ఆమె పరువుని కోర్టుకి ఈడ్చాడు. పని ఒత్తిడిగానీ, డేట్లుగానీ లెక్కలు వేసుకోకుండా దొరికిన ఏ ఛాన్స్‌నీ వదలకుండా క్యాష్‌ చేసుకునే పనిలో శృతిహాసన్‌ మునిగిపోతుందే తప్ప, ప్రణాళిక గురించి అస్సలు పట్టనే పట్టదామెకు. మహానటుడి కుమార్తెగా పరిశ్రమ రెడ్‌ కార్పెట్‌ పరిచి హీరోయిన్‌ని చేసింది. దాంతో నటన తప్పించి మిగతా గ్లామర్‌ అంతా ఒలకబోసే ఆవిడకు నటన తక్కువ ఆశ ఎక్కువ అని చెప్పుకుంటూ వుంటారు. 

తల్లి, తండ్రి సినిమా నటులే కాబట్టి చిన్నతనం నుండీ ఎలా వ్యవహరించాలో నేర్చేసుకుంది. డబ్బులు ఇచ్చిన నిర్మాత కోసం ఎన్నాళ్ళయినా పడి వుంటాడులే అనే ధోరణితో, ఏది పెద్ద ప్రాజెక్ట్‌ అయితే దానికి ప్రాధాన్యత ఇచ్చి, మిగతావాళ్ళను ఇబ్బంది పెట్టే శృతిహాసన్‌ లాంటివాళ్ళకు కోర్టులయినా తగిన బుద్ధి చెబుతాయో లేదో ప్రశ్నార్థకమే.