బాహుబలి కౌంట్ డౌన్

బాహబలి విడుదల మరో మూడు రోజుల్లోకి వచ్చేసింది. కానీ దాని ఫీవర్ అంతకంతకూ ప్రేక్షకుల్లో పెరిగిపోతోంది. థియేటర్లలో ఎన్ని వీలయితే అన్ని షోలు వేయడానికి కిందామీదా పడుతున్నారు. బాహుబలి సినిమా హక్కులు కనీవినీ ఎరుగని…

బాహబలి విడుదల మరో మూడు రోజుల్లోకి వచ్చేసింది. కానీ దాని ఫీవర్ అంతకంతకూ ప్రేక్షకుల్లో పెరిగిపోతోంది. థియేటర్లలో ఎన్ని వీలయితే అన్ని షోలు వేయడానికి కిందామీదా పడుతున్నారు. బాహుబలి సినిమా హక్కులు కనీవినీ ఎరుగని రేట్లకు అమ్ముడైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కొన్ని చోట్లు అవి మళ్లీ చేతులు మారి కొన్నవాళ్లకు లాభాల పంట పండిచాయి. 

ఇప్పుడు బరిలో వున్న బయ్యర్లు ఇబ్బడిముబ్బడిగా థియేటర్లకు సినిమాను ఇస్తున్నారు. థియేటర్ల దగ్గర నుంచి అయిదు లక్షల నుంచి ముఫై లక్షలకు పైగా అడ్వాన్స్ లు తీసుకుంటున్నారు. దీంతో బయ్యర్లు సేఫ్ జోన్ కు వెళ్లిపోతున్నారు. సినిమా ఎలా వున్నా కలెక్షన్లు మాత్రం అద్భుతంగా వుండడం గ్యారంటీ. అందువల్ల ఈ అడ్వాన్స్ లు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి అయితే రాదు. 

ఇక థియేటర్లు కూడా ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో యూనిఫారమ్ రేటుకు రెడి అయిపోతున్నాయి. గోపాల గోపాల, సత్యమూర్తి సినిమాల విడుదలప్పుడు ఇలాగే చేసారు. అంటే నేల, బెంచీ, కుర్చీతో సంబంధం లేకుండా మల్టీ ఫ్లెక్ట్ ల మాదిరిగా 100 నుంచి 150 రేటు పెట్టి అమ్మడం. దానికి గాను ఎవరి మామూళ్లు వారికి అందిపోతాయి. ఇప్పుడు బాహుబలి విషయంలో కూడా ఇది రెండు వందలుగా డిసైడ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. పైగా థియేటర్లు వేరే మార్గాల్లో కూడా మరింత ఆదాయం పొందడానికి ప్రయత్నించే అవకాశం వుంది.

ఇదిలా వుంటే బెనిఫిట్ షోలకు సన్నాహాలు జరుగుతున్నాయి. వెయ్యి నుంచి మూడు వేల వరకు టికెట్ వుంటుందని అనుకుంటున్నారు. మొత్తం మీద ఇప్పుడు బాహుబలి ఫీవర్ టాప్ కు చేరిపోయింది. ఎక్కడ చూసినా టికెట్ ఎలా అన్న డిస్కషన్లస వినిపిస్తున్నాయి. టికెట్ ల కోసం ఇలా కిందా మీదా అవడం చాలా సినిమాలకు వుంది కానీ, దాదాపు 95శాతానికి పైగా థియేటర్లలో ఒకే సినిమావిడుదల కావడం టాలీవుడ్ చరిత్రలో ఇదే ప్రధమం కావచ్చు. 

ఒక్క మనిషి..రాజమౌళిదే క్రెడిట్ అంతా. డబ్బు పెట్టేవాళ్లు వుండొచ్చు..నటించేవాళ్లు వుండొచ్చు. ఇంత లార్జర్ దాన్ లైఫ్ కాన్వాస్ ను ఊహించి, చిత్రీకరించడమే కాదు, ఓ ప్రణాళిక ప్రకారం దాన్ని మార్కెట్ చేయడం కూడా ఆయనే తన భుజాలపై వేసుకున్నారు. అందుకు మెచ్చుకోవాలి కచ్చితంగా.