Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బడా సంస్థ.. 50 కోట్ల డొనేషన్లు

బడా సంస్థ.. 50 కోట్ల డొనేషన్లు

అదో బడా నిర్మాణ సంస్థ. టాలీవుడ్‌లోకి సర్రున దూసుకువచ్చి, అందరినీ అబ్బురపరుస్తూ సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. ఒకపక్క అదే సంస్థ క్యాష్ క్రంచ్ తో బాధపడుతోందని వార్తలు వున్నాయి. చాలా బిల్లులు పెండింగ్ లో వుంటున్నాయని గ్యాసిప్ లు వున్నాయి. ఎవరికీ సరిగ్గా పేమెంట్లు ఇవ్వడం లేదని, బాగా ఆలస్యం చేస్తున్నారని, ఆఖరికి మెస్ బిల్లులు కూడా ఇవ్వడం బాగా లేట్ అవుతోందని టాక్ బలంగా వుంది.

అలాంటి సంస్థ ఇప్పుడు జరుగుతున్న ఆంధ్ర ఎన్నికలకు సుమారు 50 కోట్లు డొనేషన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పార్టీలతో సంబంధం లేకుండా కేవలం వ్యక్తిగత పరిచయాలతో, రాయలసీమ, దక్షిణ కోస్తా, తూర్పు గోదావరి జిల్లాల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్ధులకు ఆర్ధిక సహాయం అందించినట్లు తెలుస్తోంది.

వైకాపా బంధాలున్న మరో నిర్మాత రికమెండ్ చేయడంతో గోదావరి జిల్లాలోని ఓ పెద్ద చారిత్రాత్మక పట్టణం నుంచి పోటీ చేస్తున్న ఓ మాజీ మంత్రికి ఆరు కోట్ల సహాయం అందించినట్లు తెలుస్తోంది. ఆంధ్ర ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ హీరోకి అడ్వాన్స్ రూపంలో కొంత మొత్తం సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది.

ఇది ఒక్క సంస్థ వ్యవహారం. టాలీవుడ్ లో ఇంకా చాలా బడా సంస్థలు తమ తో వ్యక్తిగత సంబంధాలున్న చాలా మంది పోటీ అభ్యర్ధులకు పార్టీ బంధాలు లేకుండా ఆర్ధిక సహాయం అందించడం జరిగిపోయిందట. ప్రతి ఎన్నికకు ఇది కామన్. కొందరు లక్షల్లో సాయం అందిస్తారు. కొందరు కోట్లలో సాయం అందిస్తారు. అది వారి వారి స్ధోమతను బట్టి వుంటుంది అని కామెంట్ చేసారు ఓ నిర్మాత.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?