Advertisement

Advertisement


Home > Movies - Movie News

న‌టి జ్యోతిక మాట‌ల్లో త‌ప్పేంటి?

న‌టి జ్యోతిక మాట‌ల్లో త‌ప్పేంటి?

అదేంటో కానీ, మంచి చెప్పినా చెడుగా అర్థం చేసుకుంటున్నారు. త‌మ‌కు న‌చ్చిన‌ట్టే ఇత‌రుల అభిప్రాయాలుండాల‌నే ధోర‌ణి స‌మాజంలో పెరిగిపోతోంది. నచ్చ‌ని అభిప్రాయాల‌పై స్పందించ‌డం మానేస్తే స‌రి అని స‌ర్దుకోవ‌డం లేదు. అభిప్రాయాల‌ను వ్య‌క్త‌ప‌ర‌చిన వాళ్ల‌ను టార్గెట్ చేస్తూ...సోష‌ల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు త‌మిళ‌నాడులో న‌టి జ్యోతిక ఎప్పుడో చేసిన కామెంట్‌పై వివాదం న‌డుస్తోంది.

‘ఆలయాల తరహాలోనే పాఠశాలలు, ఆసుపత్రులను కూడా అభివృద్ధి చేయాలి’ అంటూ నటి జ్యోతిక గతంలో వ్యాఖ్యానించింది. జ్యోతిక వ్యాఖ్యల్లో కొంద‌రికి త‌ప్పు క‌నిపించింది. దీంతో ఆమెపై విమర్శలు గుప్పిస్తుంటే, వాటిని తిప్పుకొడుతూ  మరోవైపు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో జ్యోతిక భ‌ర్త‌,  ప్రముఖ నటుడు సూర్య  బహిరంగ లేఖ విడుదల చేయాల్సి వ‌చ్చింది. ఆలయాలపై జ్యోతిక చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నామని ఆ లేఖలో స్పష్టం చేశాడు. ఆ లేఖ‌లో ఏముందంటే...

‘చెట్టు ఊరకున్నా గాలి వదిలిపెట్టేలా లేదు అనే సామెత సోషల్‌ మీడియా వివాదాలకు సరిపోతుంది. ఒక అవార్డు ఫంక్షన్‌లో ఎప్పుడో జ్యోతిక చెప్పిన వ్యాఖ్యలను ఇప్పుడు లాక్‌డౌన్‌ వార్తగా సోషల్‌ మీడియాలో వివాదాస్పదంగా మారింది. ఆలయాల తరహాలోనే పాఠశాలలు, ఆసుపత్రులు కూడా అభివృద్ధి చెందాలన్న జ్యోతిక మాటల్ని కొందరు కుట్రగా చూస్తున్నారు. పాఠశాలలు, ఆసుపత్రులను దేవాలయాలుగా చూడాలన్నది అన్ని మతాలకు చెందినవారు ఆహ్వానిస్తున్నారు. కరోనా వైరప్‌ వ్యాప్తి కారణంగా జనజీవనం స్తంభిస్తున్న ఈ సమయంలోనూ మాకు వేర్వేరు వర్గాల నుండి మద్ద‌తు లభించడం నమ్మకాన్ని, సంతోషాన్ని కలిగించింది’ అని పేర్కొన్నాడు.

ఒక్క బటన్ తో తల్లుల ఖాతాల్లో 4 వేల కోట్లు

ఉమా ఓ సారి ఆ టెస్టు చేయించుకో

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?