ఆదర్శ కుటుంబం బాక్సాఫీస్ జర్నీ ముగియబోతోందా? ఈ సినిమాకు ఇక మిగిలింది ఒక్క బుధవారం మాత్రమేనా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది ట్రేడ్ నుంచి.
నిన్నటి పరిస్థితే ఈరోజు కూడా బాక్సాఫీస్ వద్ద కనిపించింది. బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఈ సినిమా రన్‌పై అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే నెగెటివ్ టాక్‌తో ఇబ్బందులు పడుతున్న ఈ సినిమాకు వసూళ్లు పెరగడం దాదాపు ఆసాధ్యం.
ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో తుపాను ప్రభావం, మరికొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ సందడి సినిమా వసూళ్లపై ప్రభావం చూపిస్తోంది. ఇటు నైజాంలో కూడా పరిస్థితి భిన్నంగా ఏం లేదు. వర్కింగ్ డే కావడంతో బుకింగ్స్‌లో పెద్దగా జోరు కనిపించడం లేదు.
ఈ సినిమాకు మరో వీకెండ్ వరకు వేచి చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే గురువారం పోటీ ఎదురవుతోంది. రామాయణ పార్ట్-1ను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఆ మేరకు ఆదర్శ కుటుంబం థియేటర్లు, షోల విషయంలో కోత పడబోతోంది.
భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా థియేటర్లలో అడుగుపెడితే సహజంగానే ఆదర్శ కుటుంబానికి స్క్రీన్ కౌంట్ తో పాటు ఆక్యుపెన్సి కూడా తగ్గుతుంది. ఇప్పటికే ఫుట్ ఫాల్ లేక ఇబ్బందిపడుతున్న ఈ సినిమాకు గురువారం నుంచి అసలైన పరీక్ష ఎదురుకాబోతోంది.
ఇక శుక్రవారం నుంచి సూర్య నటించిన సీన్ సినిమా కూడా బాక్సాఫీస్ బరిలోకి దిగనుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ 2 కొత్త సినిమాలు థియేటర్లను ఆక్రమించేందుకు సిద్ధమవుతున్న వేళ ఆదర్శ కుటుంబం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
సో.. ఎలా చూసుకున్నా ఆదర్శ కుటుంబం సోలో రన్‌కు మిగిలింది బుధవారం రోజు మాత్రమే. గురువారం నుంచి ఈ సినిమా థియేటర్లతో పాటు, ప్రేక్షకుల్ని కూడా షేర్ చేసుకోవాల్సి రావొచ్చు.
ఓవైపు నెగెటివ్ టాక్ ను భరిస్తూ, మరోవైపు ఈ రెండు సినిమాల తాకిడిని తట్టుకునే సత్తా ఆదర్శ కుటుంబానికి ఉందా?

Ak47 miss fire