పవన్ కు షాక్: ఇప్పుడు తెలుస్తుంది తెదేపా చిత్తశుద్ధి!

నిజానికి తెలుగుదేశం తరఫున.. కూటమి నిర్ణయాలను ధిక్కరించి నామినేషన్లు వేసిన వారిలో చాలా మంది ఆ బెదిరింపులను ఖాతరు చేయలేదు.

కూటమి పార్టీలు అధికారికంగా బలపరిచిన అభ్యర్థులకు మద్దతిచ్చి తీరాల్సిందే.. ఎవరైనా తేడా చేస్తే వారిని పార్టీనుంచి సస్పెండ్ చేస్తాం అని చంద్రబాబునాయుడు చాలా ఘాటుగానే ప్రకటనలు చేశారు.

నిజానికి తెలుగుదేశం తరఫున.. కూటమి నిర్ణయాలను ధిక్కరించి నామినేషన్లు వేసిన వారిలో చాలా మంది ఆ బెదిరింపులను ఖాతరు చేయలేదు. కొన్ని చోట్ల నామినేషన్లు వేసిన వారితో.. పలుమార్లు రాయబారాలు నడిపి, నాయకులతో ఒత్తిడి చేయించి కొందరిని తప్పుకునేలా చేశారు. మరికొందరు పోటీలో కొనసాగారు.

కొన్ని సస్పెన్షన్లు కూడా జరిగాయి. ఇప్పుడు ఫలితాలు వెల్లడవుతున్నాయి. తెలుగుదేశం తరఫున రెబెల్ గా నామినేషన్లు వేసిన వారిని కూడా విజయాలు వరిస్తున్నాయి.

మరి ఇప్పుడు పార్టీ ఏం చేస్తుంది? వారి సస్పెన్షన్ ను కొనసాగిస్తూ.. పార్టీనుంచి డిస్మిస్ కూడా చేసేసి.. నీకు మాకు సంబంధం లేదని ప్రకటిస్తుందా? లేదా, అభ్యర్థి ఎటూ గెలిచిపోయాడు గనుక.. మా పార్టీ వాడే అని ప్రకటించుకుని.. తమ పార్టీ ఖాతాలోకి ఆ విజయాల్ని తీసుకుంటుందా? అనేది ఆసక్తికర అంశం.

పిఠాపురంలో ఎన్నికలను సహజంగానే జనసేన చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం మాత్రమే కాదు.. ఆయన ఈ రెండున్నరేళ్లలో పిఠాపురానికి భారీ స్థాయిలో నిధులను తరలించి అనేక కార్యక్రమాలు చేపట్టారు కూడా.

ఈ నేపథ్యంలో కూటమి పార్టీలు ఎవరిని ప్రతిపాదిస్తే వారు అక్కడ ఖచ్చితంగా గెలిచేస్తారని.. జనసేన ఊహించుకుని ఉంటుంది.

కానీ.. పిఠాపురం మునిసిపల్ ఫలితాలు బహుశా పవన్ కల్యాణ్ కు ఒక రేంజిలో షాక్ ఇచ్చేలా వస్తున్నాయి. పిఠాపురంలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. 8 వార్డుల ఫలితాలు వెల్లడైన సమయానికి జనసేనకు 4, టీడీపీకి 1 మాత్రమే దక్కాయి.

ఇండిపెండెంట్లు 2 వార్డులలో గెలవగా, టీడీపీ రెబెల్ అభ్యర్థి మోర్తా చిన్నపండు 9వ వార్డులో గెలిచారు. బహుశా గెలిచిన ఇండిపెండెంట్లు కూడా ఏదో ఒక పార్టీ వారుగా తర్వాత ప్రకటించుకునే అవకాశం ఉంది.

అయితే ఇక్కడే తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధికి లిట్మస్ టెస్ట్ ఎదురుకానుంది. పార్టీ మీద తిరుగుబాటు చేసి గెలిచిన మోర్తా చిన్నపండును వారు ఏం చేయబోతున్నారు. ఆదేశాలు ధిక్కరించాడు గనుక.. పార్టీనుంచి బహిష్కరిస్తారా? ఎటూ మునిసిపాలిటీ మా చేతిలోనే ఉంది.. నీ మద్దతు మాకు అనవసరం అని దూరం పెడతారా? లేదా, గెలిచిన తర్వాత అక్కున చేర్చుకుంటారా అనేది చూడాలి.

అదే జరిగితే గనుక.. తిరుగుబాటు అభ్యర్థుల రూపంలో టీడీపీ పెద్దలే డ్రామాలు నడిపించినట్లుగా ప్రజల్లోకి సంకేతాలు వెళతాయి. పైకి ఒకటి చెబుతూ.. లోన తమ పార్టీ రెబెల్స్ కు స్థానిక టీడీపీ నాయకులు మద్దతివ్వకుంటే ఈ విజయం నమోదయ్యేదేనా అనే సందేహాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయి.

9 Replies to “పవన్ కు షాక్: ఇప్పుడు తెలుస్తుంది తెదేపా చిత్తశుద్ధి!”

  1. టిడిపిని గెలిపించి,బాబు గార్ని సీఎం చేసిన పవన్ ఆయన క్యాండిడేట్స్ ని గెలిపించలేడా?

    1. బాబు గార్ని సీఎం చేసిన పవన్ @@ నాగబాబు కూడా నమ్మడు.. బాబు లేకపోతే పవన్ కల్యాణ్ గెలవడం కష్టమయ్యేదేమో..

  2. Okapakka pulivendula lo kuda janasena oka ward gelichindi anta…🙏🙏🙏….meeru matram ila tdp janasena godava padithe thappa gelavalem ani mangala varam kaburlu chepthunnaru….so sad GA….

Comments are closed.