మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి దూసుకెళుతోంది. అయితే ఆ వర్గం ఓట్లు మాత్రం కూటమికి షాక్ ఇస్తుండగా, వైసీపీలో జోష్ నింపుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంలో ఉద్యోగులు అత్యంత కీలక పాత్ర పోషించారు. నాడు తమ ఆకాంక్షలకు విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని ఉద్యోగులంతా కక్షకట్టినట్టుగా సార్వత్రిక ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓట్లు వేశారు.
అయితే కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో ఉద్యోగుల భ్రమలు తొలిగాయి. తమను నమ్మించి మోసగించారని కూటమి నేతలపై ఆగ్రహంగా ఉన్నారు. తమ నిరసనను మున్సిపల్ ఎన్నికల్లో చాలా వరకు ఉద్యోగులు చూపారు. రెండున్నరేళ్ల క్రితం కూటమికి ఏకపక్షంగా మద్దతు తెలిపిన ఉద్యోగులు, ఇప్పుడు మాత్రం అలా లేరని పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసుకోడానికి అవకాశం లేని ఓట్లు ఏవైనా వున్నాయంటే, అవి పోస్టల్ బ్యాలెట్లే. అందుకే ఉద్యోగులు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో కూటమితో సమానంగా , మరికొన్ని చోట్ల పోటాపోటీగా, అలాగే అధికంగా కూడా వైసీపీ పోస్టల్ బ్యాలెట్లలో ఆధిక్యం ప్రదర్శించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
గ్రేటర్ విశాఖ మొదలుకుని , పులివెందుల వరకు పోస్టల్ బ్యాలెట్లలో ఆసక్తికర ఫలితాలు కనిపిస్తున్నాయి.
గ్రేటర్ విశాఖలో 999 పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీకి 446, వైసీపీకి 306 , చిత్తూరు కార్పొరేషన్‌లో టీడీపీకి 206, వైసీపీకి 211, పులివెందులలో వైసీపీకి 84, టీడీపీకి 61, విజయనగరంలో వైసీపీకి 122, టీడీపీకి 110, కడపలో వైసీపీకి 221, టీడీపీకి 196, విజయవాడలో వైసీపీకి 206, కూటమికి 301, అనంతపురం పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీ మేయర్ అభ్యర్థి రమేశ్‌కు 56 ఓట్ల ఆధిక్యం, కర్నూలు జిల్లా ఆదోనిలో వైసీపీకి 52, టీడీపీకి 51, జనసేన రెబల్ మల్లప్పకు 48, ఉయ్యూరులో వైసీపీకి 27, టీడీపీకి 9, పెడనలో వైసీపీకి 9, జనసేనకు 4, అనకాపల్లి జిల్లా యలమంచిలిలో బీజేపీ, వైసీపీకి 12 చొప్పున పోస్టల్ బ్యాలెట్లు దక్కగా, చెల్లనివి అంతే సంఖ్యలో వుండడం విశేషం.
గ్రేటర్ విశాఖలో చాలా డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీతో పోటాపోటీగా వైసీపీ అభ్యర్థులు ఆధిక్యత ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఫలితాల్ని ఉద్యోగుల ఆలోచనను ప్రతిబింబిస్తున్నట్టుగా చూడాలి.
ఉద్యోగుల్లో కూటమిపై వ్యతిరేకత కనిపిస్తుండడంతో పాటు వైసీపీపై సానుకూల అభిప్రాయాన్ని తాజా మున్సిపల్ ఎన్నికల్లో చూడొచ్చు. తమ డిమాండ్లను కూటమి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని కొన్ని నెలలుగా ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే, ఉద్యమ బాట పడతామని బొప్పరాజు వెంకటేశ్వర్లు, అలాగే ఉపాధ్యాయ, ఇతర సంఘాల నాయకులు హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం ముందుకొచ్చి, కొంత మేరకు సమస్యల్ని పరిష్కరిస్తున్నట్టుగా చెప్పింది.
ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న కూటమిపై కొన్ని చోట్ల ఉద్యోగులు వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో వైసీపీపై తమ కోపం తగ్గిందని కూడా చాటి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్ని గమనిస్తే, కూటమి వైపు పూర్తిస్థాయిలో నిలబడలేదని స్పష్టమవుతోంది. ఇదే సందర్భంలో వైసీపీపై వారిలో సానుకూలత వ్యక్తం కావడం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతోంది.
రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి ఉద్యోగుల్లో కూటమిపై మరింత వ్యతిరేకత, తమపై సానుకూలత పెరుగుతాయనే ఆశ వైసీపీలో కనిపిస్తోంది. ఎన్నికల్లో ఉద్యోగుల పాత్ర కీలకం. వాళ్లలో వ్యతిరేకత మొదలు కావడం, కూటమికి ప్రమాద సంకేతంగా చూడాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే చాలా తక్కువ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్లు ఉన్నప్పటికీ, ఎక్కువ ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేవి కావడంతో వాటి గురించి అంతా మాట్లాడుకుంటున్నారు.

జీతాలు పదవ తారీకు వరకు ఇవ్వకపోయినా… పిఆర్సీలు ఫిట్మెంట్లు డిఏలు …రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోయినా కూడా ఉద్యోగస్తులకు ఇంకా తీపి తగినట్టు లేదు అన్నియు మీద..సిగ్గు ఎగ్గూ లేని జన్మలు . పదవ తరగతి పేపర్లు కొట్టేసినోడికి ఓట్లు వెయ్యడంఏంటి చదుకున్న సన్నాసులారా ?
ఇంకా లేట్ ఎందుకు మొదలెట్టండి
ఎన్నికలు సక్రమంగా జరిగి ఉంటె వైసీపీ గెలిచేది అని
నేను ఎప్పుడు చెప్తా, మీ పార్టీ కి అంత సీన్ లేదు అని
నా మీద పడి డిలేట్ చేస్తూ ఉంటావ్ .
😀😀pandhula pempakam vaarthalu levva?
ETV Andhra Pradesh సాయంత్రం 6:30 PM కు .మీ కోసమే రా
ETV Andhra Pradesh సాయంత్రం 6:30 PM కు 😀
మీకు ఓట్లసిన ఉద్యోగులు సర్టిఫికెట్ లు లేకుండా సెక్రటేరియట్ జాబ్స్ కొట్టిన వాళ్ళు, మిగతా ఎంప్లాయిస్ ఎవడు వేయలేదు
టైంకి మందులు వాడితే తగ్గిపోతుంది.రా
Annaki Cheppu re la..daa gaa
బొల్లి అన్నకి చెప్తాను లే రా- la.. 0j daa kaa..😄
babu ki shock …jagan ki laabam ani raaseyi……..
repu dhaaka aagandi .. resesthaadu .
మరి Ntv వాడు ఏంటి పోస్టల్ బ్యాలెట్ లో 99% టీడీపీ ఆధిక్యత లో ఉంది ఎన్ని వేస్తున్నాడు .. మీరు సరిగ్గా కోఆర్డినేట్ చేసుకోలేదా ?
పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ ముందంజ అంటూ, RTV స్క్రీన్ షాట్లు ఫేక్ చేసి వదిలిన వైసీపీ…
నిజానికి మొత్తం అన్ని చోట్లా పోస్టల్ బ్యాలెట్ లో స్పష్టమైన ఆదిక్యంతో ముందంజులో ఉన్న కూటమి… ఇవి అసలైన RTV న్యూస్..
చివరకు ఎన్నికల ఫలితాలు కూడా ఫేక్ చేసి, తమ క్యాడర్ ని మోసం చేస్తున్న జగన్..
అవునా 🤔 నిజమా 😳!! నీ చెత్త లాంకో
pettandi DJ’lu, challandi poolu , samabaraalaki anna ni ready ayipomanu…..