పుర పోరులో వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి పట్టు నిలుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ రీతిలో సాగుతున్నాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రాయలసీమలో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసే పరిస్థితి లేదు.
గెలుపు సంగతి పక్కన పెడితే, నామినేషన్లు వేయడమే అతిపెద్ద విజయంగా భావించే పరిస్థితి. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తోంది.
యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ నందికొట్కూరు మున్సిపాలిటీ బాధ్యతల్ని తీసుకున్నారు. ఇక్కడ మొత్తం 32 వార్డులున్నాయి. వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా షేక్ ఫాతిమాబీని బరిలో నిలిపారు. సిద్ధార్థ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈ నేపథ్యంలో ఇవాళ కౌంటింగ్‌లో 23 వార్డుల్లో వైసీపీ , మిగిలిన 9 వార్డుల్లో టీడీపీ విజయం సాధించింది. చైర్‌పర్సన్ అభ్యర్థిగా ఫాతిమాబీ రెండో రౌండ్ పూర్తయ్యే సరికి 4 వేల మెజార్టీతో దూసుకెళుతోంది. ఇంకా మూడు రౌండ్ల కౌంటింగ్ జరగాల్సి వుంది. ఈ విజయం బైరెడ్డి సొంతమని చెప్పక తప్పదు.
ఎస్స్ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన ఇక్కడ వైసీపీ సమన్వయకర్తగా డాక్టర్ ధారా సుధీర్ ఉన్నారు. సుధీర్‌తో బైరెడ్డి సమన్వయం చేసుకుని ముందుకెళ్లడంతో మంచి ఫలితాలు దక్కాయి.
డోన్ నియోజకవర్గ పరిధిలో రెండు ఆసక్తికరంగా ఫలితాలు వెలువడుతున్నాయి. డోన్ మున్సిపాలిటీలో 36 వార్డులున్నాయి. ఇక్కడ వైసీపీ 9, టీడీపీ 8, సీపీఐ ఒక వార్డు చొప్పున గెలుపొందాయి.
డోన్ మున్పిపల్ టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి కోట్ల సుజాతమ్మ 2 వేల ఓట్ల మెజార్టీతో గెలుపు దిశగా పయనిస్తున్నారు. ఆదోని మున్సిపాలిటీలో జనసేన రెబల్ అభ్యర్థి స్వప్న 1500 మెజార్టీతో ముందు వరుసలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ మూడో స్థానానికి పరిమితమైంది.
మొదట్లో స్వప్నకే చైర్మన్ సీటు అని చెప్పి, ఆ తర్వాత టీడీపీ ఇన్‌చార్జ్ మీనాక్షినాయుడు మాట మార్చడంతో వ్యవహారం రివర్స్ అయ్యింది. జనసేన రెబల్ అభ్యర్థిపై భారీగా సానుభూతి వ్యక్తమవుతోంది. దాని ప్రభావం ఓటింగ్‌పై చూపిందనే చర్చ జరుగుతోంది.

మరి ఇన్ని రోజులు టీడీపీ గుండాలు అని చించుకుంటివి…ఇప్పుడు బైరెడ్డి గుండాయిజం అంటావా